మంగళవారం, నవంబర్ 28, 2023
Homeసినిమాయంగ్ టైగర్ ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు – Prajavaradhi

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు – Prajavaradhi

నందమూరి తారక రామారావు అనే పేరు మన రాష్ట్ర ప్రజలకు చెప్పనవసరం లేదు ఆనాటి కాలంలో రామారావు గారు తననట విశ్వరూపం చూపిస్తే ప్రస్తుత కాలంలో జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అనిపించుకొన్నాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు.

నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజును ఫ్యాన్స్ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రస్థానం బాలనటుడిగా మొదలైంది తర్వాత నిన్నే చూడాలి సినిమాతో వెండితెరను అలరించాడు అక్కడి నుండి కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తన నటనతో డాన్సులతో మెప్పిస్తూ ఎంతోమంది ఫ్యాన్స్ను సొంతం చేసుకున్నాడు.

ప్రతి సినిమాలోను వైవిధ్యమైన నటనతో మరే ఇతర నటుడు అతడు చేసిన పాత్రను చేయలేరు అన్నట్లుగా నటించడం ఆయనకు మాత్రమే సొంతం. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ ట్విట్టర్ లో ఎన్టీఆర్  పోస్టర్ పెట్టి చేతులు దులుపుకోవడంతో టీజర్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాసచెందారు.

ఆర్ ఆర్ ఆర్  సినిమాలో ఆయన కొమరం భీం పాత్రలో కనిపిస్తున్నారు ఈ చిత్రంతో మొదటిసారిగా బాలీవుడ్లో అడుగు పెడుతున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ భారీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ప్రజావారధి తరపున ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular