టాలివుడ్ లో అడుగుపెట్టి అతి తక్కువ సమయం లోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని తన నటనతో అందరినీ ఆకట్టుకున్న హీరో Allu Arjun తను మెగా కాంపౌండ్ హీరో అయినా, తన చేతిలో టాలివుడ్ లో కెల్లా బడా నిర్మాణ సంస్థ ఉన్నా ఎప్పుడూ తన నటనతోనే ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులను ఆకట్టుకునాడు. టాలివుడ్ లో మొదటిసారి “దేశముదురు” సినిమాతో సిక్స్ ప్యాక్ తో వచ్చి అందరినీ ఆచర్యపరిచి కొత్త ట్రెండ్ను టాలివుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసాడు.
ఇక Allu Arjun dans నచ్చని వాళ్ళంటూ ఎవారూ ఉండరు. ఎందుకంటే టాలివుడ్ , బాలీవుడ్, కోలీవుడ్ లలో టాప్ 5 డ్యాన్సర్ లలో ఒకడుగా నిలిచాడు. ఇక అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్సకత్వం లో వచ్చిన “అల వైకుంఠపురములో” సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు.
పలు వేదికలపై ఫ్యాన్స్ నా బలం, అదే ఫ్యాన్స్ నా బలహీనత అని చెప్పే Allu Arjun రాష్ట్రం లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నేడు తన జన్మదిన వేడుకలను ఎటువంటి ఆర్బాటం లేకుండా తన కుటుంబ సభ్యులతో ఇంట్లోనే జరుపుకోబోతునారు.
దీనితో తన ఫ్యాన్స్ ఒకింత నిరాస కలిగినా సమాజ హితం కోసం తప్పదని ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా ద్వారా బన్నీ కి విషెస్ తెలుపుతున్నారు. ఇక అల్లు అర్జున్, సుకుమార్ దర్సకత్వం లో చేస్తున్న కొత్త సినిమా టైటిల్ మరియు పోస్టర్ ను పుట్టినరోజు సందర్బంగా నేడు చిత్ర బృందం విడుదల చేసారు.
బన్నీ తదుపరి చేసే సినిమాలన్నీ బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకోవాలని అల్లు అర్జున్ ముందు..ముందు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ప్రజావారధి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.