మంగళవారం, నవంబర్ 28, 2023
Homeభక్తిబిర్యానీ కోసం ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ .. చివరికి భారీ ట్విస్ట్

బిర్యానీ కోసం ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ .. చివరికి భారీ ట్విస్ట్

ఆంద్రప్రదేశ్ లో గత కొద్దిరోజులుగా దేవాలయాలపై జరుగుతున్న దాడులు ఒకవిధంగా బక్తులకు ఆగ్రహాన్ని గురిచేస్తుంటే మరోవైపు ఈ దేవాలయాలపై దొంగలు సైతం తమ చేతివాటం చూపిస్తూ గుడిలోని  హుండీ డబ్బులను స్వాహా చేస్తున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం జల్లజర్ల లో ప్రసిద్దిచెందిన ఆంజనేయస్వామి వారి గుడిలో ఇద్దరు వ్యక్తులు ఇనుప చువ్వతో తాళాలను బద్దలకొట్టి హుండీలోని విరాళాలను పట్టుకుపోయిన ఘటనలో తగాజా తాడేపల్లిగూడెం పోలీసులు ఈ దోపిడీకి పాల్పడిన వ్యక్తులను దేవాలయంలో ఉన్న సీసీ కెమేరాల ఆధారంగా 24గంటల వ్యవధిలోనే దోపిడీకి పాల్పడిన ఆ ఇద్దరి వ్యక్తులను పట్టుకున్నారు.

తాడేపల్లిగూడెం రూరల్ సీఐ మీడియాతో మాట్లాడుతూ తాము ఇంత త్వరగా వారిని పట్టుకోవడంలో దేవాలయంలో అమర్చిన సీసీ కెమేరాలే కారణమన్నారు. ప్రతీఒక్కరూ వారి ఇల్లు, దేవాలయాలు, వ్యాపార సంస్థల వద్ద తప్పనిసరిగా కెమేరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. దోపిడీకి పాల్పడిన తోట వీరబాబు పై మొత్తం 11 కేసులున్నాయని, మూకపల్లి నాగార్జున అనే వ్యక్తిపై విశాఖపట్నం సిటీలో మొత్తం 7 కేసులు నమోదయ్యాయని అన్నారు.

వీరు ప్రధానంగా దేవాలయాల హుండీలను టార్గెట్ చేసి ఇనుప రాడ్డులతో తాళాలను బద్దలకొట్టి హుండీలోని విరాళాలను దోచుకుంటారని తెలిపారు.  వీరితోపాటు మరికొంతమందిపై కూడా కేసులు ఉన్నాయన్నారు. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ దొంగ తనం మాత్రం బిర్యాని కోసం ఆ వ్యక్తులు హుండీ పగలకొట్టి 140 రూపాయలు మాత్రమె తీసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. అయితే పోలీసు అదికారులు కొన్నిరోజులక్రితమే ఆ హుండీలోని కానుకులను దేవాలయ సిబ్బంది లెక్కించి తీసేయడంతో దానిలో చిల్లర మినగా పెద్దగా డబ్బులు లేవని తెలిపారు.  

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular