Hanuman Teaser ..గూస్ బంప్స్ తెప్పిస్తున్న హనుమాన్ టీజర్

Hanuman Teaser

Hanuman Teaser : టాలివుడ్ టాలెంటెడ్ అండ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న హనుమాన్ చిత్రం యొక్క టీజర్ ను తాజాగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇప్పటివరకూ మోషన్ పోస్టర్, గ్లిమ్ప్స్ తో ఆకట్టుకోగా తాజాగా రిలీజ్ చేసిన హనుమాన్ టీజర్ విజువల్ వండర్ తో ప్రతీ ఫ్రేమ్ ప్రేక్షకులకు గూస్బుమ్ప్స్ తెప్పిస్తున్నాయి.

ప్రతీ చిత్రంలోనూ ఏదో ఒక కొత్త ప్రయోగంతో ప్రయోగాలు చేసే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రం తో ఇంత చిన్నవయస్సులో ఇంత మంచి అవుట్ పుట్ ఇవ్వడం కచ్చితంగా అబినందించాల్సిన విషయమే.

ఇక ఈ సినిమా విషయానికొస్తే సినిమాటిక్ యూనివర్స్ లో రెండు సినిమాలను అనౌన్స్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దానిలో మొదటి సినిమాగా “హనుమాన్” తెరకెక్కుతుంది. రెండవ సినిమాగా “అధీరా” పేరుతో మరొక సినిమా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

ఇక టీజర్ లో ప్రధాన ఆకర్షణగా సినిమాటోగ్రఫీ నిలిచిందనే చెప్పాలి టీజర్ ఫస్ట్ షాట్ లో నిలుచుని వున్నా హనుమంతుని విగ్రహం, గడ్డ కట్టిన మంచులో హనుమంతుడు రామ జపం చెయ్యడం వంటి సీన్స్ ఈ టీజర్ ను మరో స్థాయికి తీసుకు వెళ్ళాయి. ఇక ఈ సినిమా హిందూ పురాణాలలో ఎంతోమంది సూపర్ హీరోలు ఉండగా వారిలో ఒకరైనా హనుమంతుని కధను ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

 


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి