అమెరికాలో శ్రీ రామ భక్తుడు ఆంజనేయ స్వామీ విగ్రహాన్ని ప్రతిస్టించారు ఈ విగ్రహం ఎత్తు 25 అడుగులు కాగా బరువు 30 వేల కేజీలు. అయితే దీనిని తెలంగాణా లోని వరంగల్ లోని శిల్పులు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం చెక్కారు. ఈ విగ్రహాన్ని ఏకశిలా గ్రానైడ్ రాయితో చెక్కినట్లు తెలుస్తోంది. ఈ విగ్రహానికి అయిన ఖర్చు సుమారు లక్ష డాలర్ల వరకూ కర్చు అయినట్లు తెలిపారు.
ఈ విగ్రహన్ని తెలంగాణా లో తయారు చేసి షిప్ ద్వారా అమెరికాకు తరలించారు. ఈ విగ్రహాన్ని 6 వేల మంది అమెరికాలోని హిందూ బక్తులు ప్రతిష్టించేదుకు సహాయం చేయగా అమెరికాలో ఉంటున్న హిందూ అసోసియేషన్ లో ఉన్న 300 మంది ఈ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసారు.
దీనిని అమెరికా లోని డెల్వేర్ నగరంలో దీనిని ప్రతిష్టించారు. అయితే అమెరికాలో తెలుగు వారు గత కొంత కాలంగా ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్టించడంకొరకు అక్కడి ప్రభుత్వాన్ని అనుమతి కోరడంతో అమెరికన్ ప్రభుత్వం నుండి వీరికి అనుమతి లబించింది.
అయితే సుమారు 60 కుటుంబాలు నాలుగున్నర ఎకరాల భూమిని కొని అక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారు. విగ్రహాన్ని సుద్ది చేసి ప్రతిస్టించడం కోసం బెంగుళూరు నుండి బ్రాహ్మణులు అక్కడికి వెళ్ళారు. సుమారు 10రోజుల పాటు అక్కడ పూజలు జరగనున్నాయి.