ఇలా చెయ్యండి చచ్చినా జుట్టు రాలదు.. నల్లగా నిగనిగలాడుతుంది.

0
202
Hair Fall Tips in Telugu
Hair Fall Tips in Telugu

ప్రస్తుత రోజుల్లో ఒత్తిడి, అధిక పనిభారం ముఖ్యంగా పొల్యూషన కారణంగా చిన్న వయసులోనే జుట్టు రాలిపోతుంది. ఈ సమస్య వల్ల చాలా బాధపడుతుంటారు. అందరిలా తమకు జుట్టు ఉంటే బాగుంటుందని అనుకుంటారు దీనికోసం ఎన్నో రసాయనిక ఉత్పత్తులను, మెడిసిన్లు వాడుతుంటారు.

కానీ అవన్నీ అంత మంచిది కాకపోగా తాత్కాలిక రిజల్ట్ తో సైడెఫక్ట్ లు వస్తాయి. అందుకే సహజ పద్ధతులు ఉపయోగించి జుట్టు పై కేర్ తీసుకుంటే ఖఛ్చితంగా మన జుట్టును కాపాడుకోగలం.

మన సౌందర్యానికి కురులపై అందరికీ చొరవ ఎక్కువే.. అటువంటి శిరోజాలను  ఆరోగ్యంగా ఉంచుకోవడంలో నేచురల్ పద్ధతులు ఫాలో అవ్వడం చాలా ఉత్తమం మంచిది కూడా ఈ నేపథ్యంలో మనజుట్టు ఊడకుండా నల్లగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

మంచి కొబ్బరికాయను తీసుకుని బద్దలుకొట్టి ఆ చెక్కల్లో కొబ్బరిని కోరి మీక్సీ పట్టి దాన్ని వడకడితే పాలు వస్తాయి . ఆ పాలను తలకు పట్టించి అరగంటసేపు అలాగే ఉంచాలి. ఆ తరువాత తలకు చన్నీళ్ళ స్నానం చెయ్యాలి.

ఒకవేళ తలస్నానం చేసే వీలు లేకపోతే అలానే ఉంచుకుని తలకు ఒక కవర్ లాంటిది కట్టుకుని. తరువాత రోజు తల స్నానం చేయవచ్చు. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే జుట్టురాలడాన్ని అరికట్టవచ్చు. జుట్టు వత్తుగ పెరుగుతుంది. నల్లని ఒత్తైన కురులకు చక్కని చిట్కా  ఇది తప్పక పాటించండి.