రాష్ట్రం లో రెండు రోజులుగా మద్యం విక్రయాలు మొదలు పెట్టినప్పటినుండీ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలనుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహిళలు సైతం లాక్ డౌన్ సమయంలో మద్యం విక్రయాలు కొనసాగించడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
అయితే మద్యం విక్రయాలపై సోషల్ మీడియాలో మద్యం విక్రయానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని, దీనికి బాద్యత కేంద్రానిదే అన్నట్లుగా వ్యవహరించడంతో ఈ విషయంపై బీజేపీ నాయకులు జీవీఎల్ నరసింహరావు వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
లిక్కర్ అమ్మకాల విషయంలో ప్రజల్లో అపోహలు కలగజేయడానికి వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రెండురోజుల క్రితం మద్యం సేల్స్ కొన్ని రాష్ట్రాలు ప్రారంబించాయన్నారు . రాష్ట్రాల్లో ఆదాయం క్షీణించిందని తమకు కొంచెం సడలింపు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాలనుండి కేంద్రానికి వొత్తిడి రావడంతో అయిస్టతతో నిర్ణయాధికారాలు రాష్ట్రానికే కేంద్రం వొదిలేసిందన్నారు.
లిక్కర్ సేల్స్ అనేది రాష్ట్రానికి సంబంధించిన విషయమని కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. లిక్కర్ నుండి వచ్చే ఆదాయం రాష్ట్రానికే వెళ్తుందన్నారు. అయితే వైసీపీ లోని కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలని అన్నారు.
మంత్రులు కేంద్రం మద్యం విక్రయాలు చేసుకోవచ్చిని అదేసిస్తేనే చేసామని చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య అన్నారు. ఒక వేల మద్యం విక్రయాలు కేంద్రం ఇచ్చిన ఆదేశం అయితే తమిళనాడు, కేరళ లో ఎందుకు మద్యం అమ్మడం లేదన్నారు. ఇదంతా వైసీపీ వాళ్ళు చేస్తున్న మైండ్ గేమ్ అన్నారు.
రెండు రోజులుగా పెంచుతున్న మద్యం ధరలు తమ నిర్నయమా లేక కేంద్రం చెబితేనే పెంచుతున్నారా అని అడిగారు. మీరు తీసుకున్న నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వాన్ని బాద్యుల్ని చేయడం తగదన్నారు. స్టేట్ ఎక్షైజ్ డ్యూటీ రాష్ట్రానికి సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపాయలు వస్తుందన్నారు ఇదంతా రాష్ట్రానికే వెళ్తుందని పెంచిన ధరలు సైతం రాష్ట్రానికే వెళ్తుందన్నారు. వైసీపీ మంత్రులు అన్ని రాష్ట్రాలకంటే ముందు మద్యం విక్రయాలు ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయానికి కారణాలు చెప్పాలనారు.