ఎప్పుడూ గలగలా పారే గోదావరి జలాలతో కళకళలాడే పచ్చటి పొలాలు నేడు బీటలు వారి నోరేల్లబెడుతున్నాయి. గత కొద్దిరోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో ఏ పొలంలో చూసినా గోదావరిని తలపించేవి ఇప్పుడు ఆకు నూర్చిన చేలు నీళ్ళు లేక బీడుభూములుగా మారాయి ఈ పరిస్థితి ఎక్కడో కాదు పేరులోనే గోదావరిని పెట్టుకున్న మన పశ్చిమగోదావరి జిల్లాలో చాలా చోట్ల ప్రస్తుత పరిస్థితి. తాజాగా ఈ విషయంపై పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డారు.
ఒకవైపు గోదావరిలో వరద నీరు సముద్రంలో వృదాగా కలుస్తుంటే వరి చేలకు మాత్రం నీళ్ళు లేవన్నారు. ఇది ప్రకృతి విపత్తు వల్ల ఇలా జరగలేదని, ప్రభుత్వం ప్రణాళికా రాహిత్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. వానాకాలంలో వేసే సార్వా పంటకు నీళ్ళు లేక మోటార్ సైకిల్ చేల్లల్లో తిరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి అసమర్ధ ప్రభుత్వం పంట పొలాలకు నీళ్ళు ఇవ్వలేనప్పుడు రైతులు ఇప్పటి వరకూ పెట్టిన పెట్టుబడి 15 వేల రూపాయలు నష్టపరిహారం క్రింద తిరిగి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ మీకూ మీ ప్రభుత్వానికి ఒక దండం అంటూ ప్రభుత్వం పై మండిపడ్డారు.

ఇప్పటికే చివరి క్రాఫ్ మినహా రెండు సంవత్సరాలుగా రైతులు వర్షాల కారణంగా భారీ నష్టాలను చవి చూసారు. పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చాలా చోట్ల మునిగిన పంటను చేలలోనే ఉంచేసి దమ్ము చేయించిన పరిస్థితి ఏర్పడింది.
ఇక కొంచే తేరుకుని పంట చేతుకొచ్చిన తరుణంలో ఆ పంటను ప్రభుత్వం చేతిలో పెట్టగా చాలామంది రైతులకు ఇప్పటివరకూ ఒక్క పైసా కూడా ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలో జమచేయ్యక పోవడంతో వడ్డీలు పెరిగిపోయి ఆ వడ్డీలు కట్టలేక నానా అవస్థలూ పడుతున్నారు. అందులోనూ కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ఇక కొత్తగా పంట వేయాడానికి డబ్బులు లేక క్రాఫ్ హాలిడే ప్రకటించే పరిస్థితి రైతులకు తలెత్తింది.
ఇవి కూడా చదవండి….త్వరలో జగన్ ప్రభుత్వానికి మరో ఘులక్ ఇవ్వనున్న రఘురామకృష్ణ రాజు
అమరావతి సమరానికి 600రోజులు …మళ్ళీ ఉవ్వేత్తున ఎగసిన ఉద్యమం
అదరగొడుతున్న Ola Electric Scooter 24 గంటల్లో లక్ష ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ల బుకింగ్
SR Kalyana Mandapam Review | ఎస్.ఆర్. కళ్యాణ మండపం మూవీ రివ్యూ