కరోనా ప్రపంచంలో ఏ కార్యాన్ని ప్రశాంతంగా జరగనివ్వడంలేదు. ఏ పనిచెయ్యాలన్నా, కనీసం ప్రశాంతంగా బయటకి రావాలన్నా వీలుపడడడం లేదు. ఇక తొలిఏకాదశి అయిపొయింది పండగలు ఒక్కొక్కటీ రానేవస్తున్నాయ్ ఈ ఇక కరోనా మహమ్మారి వల్ల మార్చి నెల నుంచి దేశవ్యాప్తంగా అన్ని పండుగలకూ ఆటంకాలు ఏర్పడ్డాయి. అవీ ఇవీ అనిలేదు ప్రజల శ్రేయస్సు కోసం ఉగాది మొదలుకొని శ్రీరామ నవమి, రంజాన్, గుడ్ ఫ్రైడే పండుగలను జనం ఇళ్లలోనే ఉండి జరుపుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తెలంగాణలో బోనాలు కూడా భక్తులు లేకుండా జరుపుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి కాబట్టీ రాబోయే పండుగలకు కూడా ఆంక్షలు తప్పడంలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది గణేష్ ఉత్సవాలకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం ఓ ప్రకటనను విడుదల చేసి దానిలో పలు నిబంధనలు జారీచేసింది.
మాములుగా గణేష్ మండపాల అనుమతులు తీసుకోవాలి కానీ చిన్నాచితకా మండపాలు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గణేష్ మండళ్లకు కచ్చితంగా అనుమతి తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను మండపాల నిర్వాహకులు తప్పకుండా పాటించాలని, నాలుగు అడుగులకు మించి విగ్రహం ఎత్తు ఉండకూడదని నిబంధన విధించారు. అంతేకాదు ఈ ఏడాది గణేష్ విగ్రహ ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమంకు అనుమతి లేదని మహారాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పేసింది. గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలనుకునే వారు వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని.. లేదంటే సరస్సు, నదుల దగ్గరకి రాకుండా ఇంటి వద్దనుండే నిమజ్జనం చేయాలని మహారాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం సూచించింది. కాగా ఆగష్టు 22 నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.