బ్రేకింగ్ …. ఆఫీసులు ఓపెన్ వాళ్లకు మినహాయింపు

0
121
government employees
government employees

కరోనా వల్ల సామాజికదూరం పాటించాలనే నేపథ్యంలో ఉద్యోగులుకూడా ఇళ్లకే పరిమితమయ్యారు అయితే లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు నేటి నుండి విధులకు హాజరు కానున్నారు వీళ్ళలో హోదాల్నిబట్టి సడలింపులు ఉన్నట్టు తెలుస్తోంది.  అసిస్టెంట్ సెక్రటరీ పైన స్థాయి అధికారులు అందరూ విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇక మిగిలిన ఉద్యోగులంతా కనీసం 33 శాతం  హాజరవ్వాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది.

ఇక పలు దీర్ఘకాలిక వ్యాధులతో, 65 ఏళ్లు దాటిన వారికి, గర్భవతులకి  వారికి మాత్రం మినహాయింపు లభించింది. దీనితోపాటు విధులకు హాజరయ్యే ప్రతీ ఉద్యోగి ఆఫీసులో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది  ప్రభుత్వం. ఒకవేళ ఎవరికైనా ఫ్లూ లక్షణాలు ఉంటే వాళ్ళను లోపలికి అనుమతించరాదంటూ ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు  అధికారులు తెలిపారు..