ఇకపై తెలుగు వాయిస్ తో పలకరించనున్న google voice assistant

0
161
Google Voice Assistance is now Telugu Voice
Google Voice Assistance is now Telugu Voice

ప్రపంచ సెర్చ్ఇంజెన్ దిగ్గజం గూగుల్ తన టెక్నాలజీ తో ప్రజలకు చేరువ కావాలని బావిస్తుంది దీనిలోబాగంగా google voice assistant ను తెలుగులో ప్రవేసపెట్టింది. దీనికి కారణం భారత దేశంలో ఉన్న అనేక భాషలు దీనిలో తెలుగు మాట్లాడేవారు సుమారు ఎనిమిది కోట్ల మంది ఉండడంతో google voice assistant ద్వారా తమ సేవలను వినియోగదారుని వద్దకు  తీసుకువెళ్ళాలని భావిస్తోంది.

ఇప్పటివరకు google voice సేవలు ఇంగ్లీష్ లో మాత్రమె అందేవి ఇకపై తెలుగుతో పాటు హిందీ, ఉర్దూ, కన్నడ, తమిళ, మరాఠీ, గుజరాతీ భాషలలో  తన స్వరాన్ని వినిపించనుంది.

ఈ కొత్త సదుపాయం వాడాలనుకునేవారు తమ డివైస్ లో ఉన్న గూగుల్ యాప్ అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని అప్ డేట్ చేసినతరువాత తమ బాషతో మాట్లాడాలంటే “ఓకే గూగుల్ తెలుగులో “ అని కానీ లేక “ఓకే గూగుల్ టాక్ టుమి ఇన్ తెలుగు “ అని గాని పిలవాలి.

దీనిపై ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ ఈ సదుపాయం ద్వారా గూగుల్ తమ సేవలు ప్రాంతీయ భాషల ప్రజలకు మరింత ఉపయోగపడతాయని అన్నారు.