శనివారం, మే 25, 2024
Homeటెక్నాలజీఅప్డేట్ చెయ్యని Gmail Account లను త్వరలో డిలీట్ చెయ్యనున్న గూగుల్

అప్డేట్ చెయ్యని Gmail Account లను త్వరలో డిలీట్ చెయ్యనున్న గూగుల్

ప్రముఖ ప్రపంచ సెర్చ్ ఇంజెన్ సంస్థ గూగుల్ తాజాగా Gmail కి సంబంధించి ఒక అప్డేట్ తీసుకు వచ్చింది ఆ అప్ డేట్ లో ఇప్పటివరకూ Gmail వాడుతున్న ప్రతీ ఒక్కారూ లాస్ట్ రెండు సంవత్సరాల నుండి Gmail ఎకౌంట్స్ ను వాడని యూజర్ల Gmail ఎకౌంట్ లను తొలిగించాలనే నిర్ణయం గూగుల్ తీసుకుంది.

దీనిలో బాగంగానే గూగుల్ తన ఇన్ యాక్టీవ్ పోలిసీస్ లో కొన్ని మార్పులు కూడా చేసినట్లు తెలుస్తోంది. అంతే కాక గూగుల్ Gmail ఉన్న పతీ ఒక్కరికీ మెస్సేజెస్ కూడా పంపించింది. వెంటనే ఇప్పటి వరకూ ఉన్న మీ అన్ని Gmail ఎకౌంట్ లను లాగిన్ అవ్వాలని సూచించింది లేకుంటే 2 సంవత్సరాలు దాటిన Gmail ఎకౌంట్స్ డిలీట్ చేస్తామని తెలిపింది.

Gmail ఎకౌంట్స్ డెలీట్ చెయ్యడానికి గల కారణాలను కోడా తెలిపింది గూగుల్. ఇప్పటి వరకూ ఉన్న Gmails లో చాలా వరకూ యూజర్లలో ఎక్కువ సంఖ్యలో Gmail ఎకౌంట్స్ ఉంటున్నాయని వాటిలో చాలా ఎకౌంట్స్ వాడకుండా అలా వదిలేస్తున్నారు ఆ Gmail ఎకౌంట్స్ కి సరైన ఆతంటికేషణ్ కూడా లేవని తెలిపింది అంటే సరైన స్ట్రాంగ్ పాస్ వర్డ్, రికవరీ మెయిల్, ఫోన్ నెంబర్ ఏమీ లేకుండా Gmail క్రియేట్ చేసి వాటిని అలా వదిలేయడంతో హేకర్స్, సైబెర్ నేరగాళ్ళు వాటిని సులబంగా యాక్సెస్ చేయ్యగలుగుతున్నారని, ఇలాంటి Gmail ఎకౌంట్స్ ఉపయోహించి నెరగళ్లు సైబెర్ నేరాలకు పాల్పడుతున్నారని Google హెచ్చరించింది.

ఈ కారణంతోనే వాడని, పనిచెయ్యని Gmail Account లను తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ విధానం పూర్తి గా అప్డేట్ అవడానికి 2023 డిసంబర్ లోపు ఈ పాలసీని అప్డేట్ చేస్తామని తెలిపింది. ఈలోపే Gmail ఎకౌంట్స్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఎకౌంట్ లాగిన్ అయ్యి ఆ ఎకౌంట్స్ యాక్టీవ్ లో ఉంచాలని లేకుంటే ఎకౌంట్ డిలీట్ చేస్తామని తెలిపింది ఒకవేళ Gmail Account డిలీట్ అయితే ఆ ఎకౌంట్ కి అనుసంధానంగా ఉన్న డేటా ఐన Google Photos, Mails, Contacts వంటి మొత్తం డేటా తొలగించబడుతుందని తెలిపింది.

ఇలా జరగకూడదంటే Gmail Account Login అయ్యి కొన్ని మెయిల్స్ చదవడమో, ఎవరికైనా మెయిల్స్ పంపించడమో, లేదా Gmail Account కి లింక్ అయిన మరేదైనా ఫ్లాట్ ఫాం లో అప్డేట్ చెయ్యడం లాంటివి చేస్తే ఆ Gmail Account యాక్టీవ్ లో ఉంటుందని తెలిపింది. అంతేకాక ఈ అప్డేట్ ఒక్క యూజర్స్ కు మాత్రమేనని ప్రభుత్వ, బిజినెస్, ఆర్జనైజేషన్స్ వంటి వాటికి ఈ విధానం వర్తించదని తెలిపింది.

Read Also…Amazon Prime Day Sale 2023: కళ్ళు చెదిరే ఆఫర్లు ఇస్తున్న అమెజాన్

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular