కరొనా నేపథ్యంలో కేవలం వైన్ షాపులు మాత్రమే కాదు కల్లు కూడా బంద్ అయ్యాయి. ఈ దెబ్బకి పాపం సాయంత్రం పూట ఒక లోటా కల్లుతాగి పడుకునే కల్లుప్రియుల గొంతు ఎండిపోయింది. వేసవిలో మాత్రమే దొరికే ఈ పానీయం పై కూడా కరోనా ప్రభావం పడింది లాక్ డౌన్ కారణంగా తెలంగాణలో గీత కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారు.
అయితే కరొనా నిబంధనలు పాటిస్తూ కళ్లు గీత కార్మికులకు కల్లు తీసుకుని అమ్ముకోవచ్చని దీనికై రాష్ట్ర ప్రభుత్వం అనిమతిని ఇచ్చిందని తెలంగాణ రాష్ట్ర అబ్కారి శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు కాకపోతే గీతకార్మికులు మాత్రం వ్యక్తిగత దూరం పాటించడం మాస్కులు ధరించడం ఇంకా ప్రభుత్వ నిభందనలు పాటించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ గౌడ్ తన కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని వెల్లడించారు.
నీరా కల్లు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుందని 30,40 రొగాలను నివారణ అన్నారు మంత్రి. సీఎం కెసిఆర్ కల్లు గీత సంఘాలు, గౌడ సంఘాలు అడిగిన వెంటనె కల్లు గీత కార్మికుల ఇబ్బంధులను అర్ధం చేసుకొని కరొనా నిబంధనలు పాటిస్తూ కల్లు గీసుకొవడానికి అనుమతిని ఇవ్వడం జరిగిందన్నారు మంత్రి.