గురువారం, జూన్ 8, 2023
Homeజాతీయంబ్రేకింగ్ న్యూస్ : ఇకపై ఇంటి వద్దకే మద్యం... మరో 120 ఎక్షట్రా

బ్రేకింగ్ న్యూస్ : ఇకపై ఇంటి వద్దకే మద్యం… మరో 120 ఎక్షట్రా

ఒక వైపు కరోనా నేపద్యంలో కూడా ఆర్దిక లాభం పోతుందనే ఉద్దేశంతో ప్రభత్వాలు మద్య నిషేదాన్ని తుంగలో తొక్కుతున్నాయి. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ లో గ్రీన్ జోన్ ఏరియాలలో లో ఉన్న అనేక మండలాల్లో మద్యం విక్రయాలు ఒక రకంగా ఫుల్ జోష్ లో ఉన్నాయనే చెప్పాలి. సుమారు 40 రోజుల కు పైగా మద్యం విక్రయాలు రాష్ట్రంలో ఆపేయడంతో  మందు బాబులు అందరూ ఒక్కసారిగా నిరుత్సాహ పడిపోయారు. అయితే నిన్నటి నుంచి మద్యం విక్రయాలు కొనసాగించారు. అయితే చాలా చోట్ల వీరిని అదుపుచేయలేక నానా అవస్థలు పడ్డారు. సోషల్ డిస్టెన్స్ ను పూర్తిగా తుంగలోతొక్కి ఇష్టం వచ్చినట్లు గుంపులుగా మద్యం షాపులవద్ద క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. దీనిపై ప్రభుత్వానికి ప్రజలనుండి తీవ్ర విమర్శలు రావడంతో ఏపీ ప్రభుత్వం ఈ రోజు మద్యం ధరను ఇంకో 50 శాతం పెంచి మందుబాబులు మద్యానికి దూరంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంది.

అయితే మన పక్కరాష్ట్రం చత్తీస్ఘడ్ ప్రభుత్వం మాత్రం  మద్యం సేవించేవారికి వారి ఇంటి వద్దకే మద్యం సరఫరా చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీని  కోసం ఒక ఆన్ లైన్ పోర్టల్ ను సైతం ప్రభుత్వం ప్రారంభించింది. మద్యం కావాల్సిన  వారు తమకు అవసరమైన బ్రాండ్ మద్యం ఆర్డర్ తో పాటు డబ్బులను కూడా ఆన్ లైన్ పోర్టల్ లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఇక  ఒక వ్యక్తి  5000 ఎంఎల్ ల  మధ్యం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. మద్యం ఇంటికి డెలివరీ చేసినందుకు గాను డెలివరీ చార్జీలు రూ. 120రూ. వసూలు చేస్తారు. ప్రస్తుతం కరోనా విజ్రుంబిస్తున్న తరుణంలో మన రాష్ట్రం కూడా ఇలా ఇంటికి మద్యం డెలివరీ చేస్తుందో లేదో వేచి చూడాలి.

RELATED ARTICLES

Most Popular