కరోనావల్ల చాలా పరిక్షలు వాయిదాపడ్డాయి. స్కూల్స్ దగ్గరనుంచి యూనివర్సిటీల వరకు అన్ని బంద్ అయ్యాయి. ఇక 9వ తరగతివరకు ఏ పరిక్షలు లేకుండానే పైతరగతులకు పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక లాక్ డౌన్ వల్ల మెడికల్, ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ, నీట్ పరీక్షలను హెచ్ఆర్డీ వాయిదా వేసిన నేపథ్యంలో వాటికి సంబంధించి కొత్త తేదీని మే 5న ప్రకటించనున్నట్టు కేంద్ర మానవ వనరులు, అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎక్కడివక్కడే నిలిచిపోవడంతో జేఈఈ, నీట్ పరీక్షలకు కొత్తతేదీని మే 5న ప్రకటన చేయనున్నట్లు వెల్లడించింది హెచ్ఆర్డీ ఈ ప్రకటనతో కొంతకాలంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశ పరీక్షల కోసం చూస్తున్న విద్యార్థులకు ఊరట లభించింది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అదేరోజు అంటే మే 5 న ఈ విషయమై వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో విద్యార్థుల్లో నెలకొన్న తికమక తొలగిపోనుంది.
ఇదిలా ఉండగా లాక్ డౌన్ వల్ల విద్యార్థుల చదువులు అటకెక్కాయి. ఆన్ లైన్ లో బోధనలు, చిన్న చిన్న పరీక్షల నిర్వహణతో ఆశించినంత ఉపయోగం లేదనేది అందరి వాదన. ఇక స్కూళ్ల విషయం అగమ్యగోచరంగా తయారయింది. లాక్ డౌన్ ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వెళ్లడం అటు తల్లిదండ్రులను ఇటు విద్యార్థులను కలవరపెడుతోంది.