గురువారం, మార్చి 30, 2023
Homeజాతీయంఏపీ లో పిడుగు పాటుకు నలుగురు మృతి..

ఏపీ లో పిడుగు పాటుకు నలుగురు మృతి..

ఏపీ లో ఉన్న శ్రీకాకుళం మరియు విజయనగరం, విశాఖ జిల్లాలో శుక్రవారం సాయంత్రం పిడుగు లు పడే ప్రమాదం ఉండడంతో రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. శ్రీకాకుళం: సీతంపేట, కొత్తూరు, పాలకొండ, బర్జ,  రెగిడి అమదాలవలస, సరుబుజ్జిలి, లక్ష్మి  నర్సుపేట, హిరమండలం, వంగల, వీరఘట్టం. కాగా శుక్రవారం నాడు సాయంత్రం హెచ్చరికలు జారీ చేసిన కొన్ని గంటల్లోనే శ్రీకాకుళం జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. 

శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులతో కూడిన వాన కురిసింది. అయితే ఈ పిడుగు పాటుకు జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వంగర మండలంలో ముగ్గురు, సీతంపేట మండలంలో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఇక ఏపీ లోని  శ్రీకాకుళం జిల్లా వంగర మండలం గీతనాపల్లి గ్రామానికి చెందిన  10వ తరగతి విద్యార్థి పొలం వద్ద ఉండగా అక్కడ పిడుగు పడి అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అదే వూరికి చెందిన 61 ఏళ్ల వయస్సు ఉన్న సలాపు శ్రీరాములు అనే ఇంకో వ్యక్తి పశువులను  మేతకు తీసుకెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా పిడుగు పాటుతో మృతి చెందారు.

అలాగే, శ్రీహరిపురం గ్రామానికి చెందిన 43 ఏళ్ల వడ్డిపల్లి శంకర రావు తన పొలం వద్ద పశువులు మేపడానికి అక్కడికి వెళ్లగా సమీపంలో పిడుగు పడి తాను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ముగ్గురూ నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో వాళ్ళ కుటుంబాలను పూర్తిగా  ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అంతేకాక సీతంపేట మండలంలోని తుంబకొండలో వర్షం వస్తున్న సమయంలో 35 ఏళ్ల వయసు గల అరిక ఆనందరావు మరియు  నిమ్మక గోపీ లు ఇద్దరూ చెట్టు కింద ఉన్నారు. వాళ్లకు సమీపంలోనే పిడుగు పడటంతో వారిద్దరూ అపస్మారక స్థితిలోకి వెల్లిపోయారు. వెంటనే ఆనంద రావు, గోపీలను అక్సీకడి నుండి సీతంపేట ప్రభుత్వ హాస్పటల్ కి తరలిస్తుండగా ఆనందరావు అనేవ్యక్తి మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలాడు.

గోపీని మాత్రం సీతంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించి, తర్వాతా మరింత మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడినుండి పాలకొండ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకి గురి అయ్యారు.

RELATED ARTICLES

Most Popular