బుధవారం, అక్టోబర్ 4, 2023
Homeఅంతర్జాతీయంఅమెరికాలో నలుగురు భారతీయులు కరోనాతో మృతి

అమెరికాలో నలుగురు భారతీయులు కరోనాతో మృతి

కరోనా భయం రోజు రోజుకూ ప్రజల్లో పెరిగిపోతోంది. ఇక అమెరికాలాంటి దృడమైన ఆర్దిక వ్యవస్థ గల  అగ్రరాజ్యం సైతం ఇప్పుడు  కొవిడ్ -19 కబంద హస్తాల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి రోజు రోజుకూ చేయిదాటిపోయే స్థితిలో ఉంది.

ప్రతీ రోజూ కరోనా కేసులు కుప్పలు కుప్పలుగా పెరుగుతూనే ఉన్నాయి. కరోనా తో చనిపోయినవారిని అక్కడ పూడ్చేందుకు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు హృదయవిదారకంగా మారుతున్నాయి. ఇక అత్యంత సంపన్న నగరమైన న్యూయార్క్ విషయానికొస్తే ఇప్పుడు ఈ ప్రాంతం  కరోనాకి కేంద్ర బిందువుగా మారింది.

ఆ రాష్ట్రంలో  1,13,000 కు పైగా కరోనా కేసులు నమోదవ్వగా అమెరికా మొత్తం తో పోల్చితే  ఒక్క న్యూయార్క్ లోనే 63 వేల మందికి పైగా కరోనా సోకడం ప్రస్తుతం అక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది.

అక్కడ ఇప్పటికే సుమారు 2000 మందికి పైగా కరోనాతో మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కరోనా సోకి నలుగురు భారతీయులు మృతి చెందడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. అక్కడ కరోనా సోకినా నలుగురిలో ముగ్గురు సుమారు నలభై సవత్సరాలు పైబదినవారే.

వీరిలో ఆలేయమ్మా కురియకోశే(65) అనే వృద్ధురాలుతో పాటు తంకంచన్​ ఎంచెనట్టు(51), అబ్రహం శామ్యూల్​(45), షాన్​ అబ్రహం(21)లు కరోనా సోకి ప్రాణాలు వదిలినట్లు ఉత్తర అమెరికాలోని కేరళ అసోసియేషన్​ ఫెడరేషన్​ నోట్ విడుదల చేసింది. న్యూయార్క్ లోని భారత కొన్స్లేట్ జెనరల్ ఇప్పటికే చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు సమాచారం అందించినట్టు తెలిపారు.

WhatsApp Group Join Now
RELATED ARTICLES
- Advertisment -

Most Popular