శుక్రవారం, మార్చి 31, 2023
Homeజాతీయంమహారాష్ట్ర లోని మరో మృత్యు ఘటన.. పట్టాలపైన 15 మంది మృతి

మహారాష్ట్ర లోని మరో మృత్యు ఘటన.. పట్టాలపైన 15 మంది మృతి

మహారాష్ట్ర లోని మరొక విషాదం చోటు చేసుకుంది. రైలు పట్టాలు పైన నిద్రిస్తున్న 15 మంది వలస కూలీల పైనుండి గూడ్స్ రైలు దూసుకెళ్లి పోయింది. ఈ ఘటన మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ లో చోటు చేసుకుంది.

చత్తిష్ఘడ్ కి చెందిన వలస కూలీలు సొంత ఊళ్లకు వెళ్లే తరుణంలో అలసిపోయి రాత్రి పూట రైలు పట్టాలపై నిద్రిస్తుండగా 15 మంది పై  గూడ్స్ రైలు వారి పైనుండి దూసుకెళ్లిన ఘటన ఇప్పుడు అందరినీ కలచి వేస్తుంది. ఈ ఘోర రైలు ప్రమాద ఘటన శుక్రవారం జరిగింది. ఈ రైలు ప్రమాదం ఔరంగాబాద్ మరియు జాల్నా మద్య చోటు చేసుకుంది. అక్కడి మృతుల్లో చిన్నారులు కూడా ఉండటం చాలా బాధాకరమైన విషయం.

అయితే ప్రమాదానికి గురైన వలస కూలీలంతా రైలు ఎక్కడానికి రైలు పట్టాలపై నడిచి జల్నా నుంచి భుపాల్ వెళ్తున్నారని సమాచారం. వీరంతా 35 కి.మీ. దూరం నడిచాక అలసిపోయిన వీరు విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో వీరు పట్టాలపై నిద్రించారని తెలుస్తోంది. గూడ్స్ రైలు వేగంగా వారి పై నుండి వెళ్ళిపోవడంతో సంఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

తెల్లవారు 4 గంటలకు ఈ ఘటన జరిగిందని అంతా భావిస్తున్నారు. కాగా ఉదయం 6 గంటలకు అధికారులకు సమాచారం అందడంతో పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైల్వే ఫోర్స్, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి  చేరుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

వలస కార్మికుల కోసం రైళ్లు నడపాలి.

అయితే తెల్లవారుజామున ఔరంగాబాద్ లో జరిగిన ఈ దుర్ఘటన వల్ల 15 మంది చనిపోగా వలస కార్మికలు ప్రాణాలు కాపాడాలనుకుంటే ఇంకా ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకూడదనుకుంటే ముందు జాగ్రత్తగానే వలస కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రైళ్లు తిప్పాలని ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular