బుధవారం, అక్టోబర్ 4, 2023
Homeసినిమాభారీ పెట్టుబడితో OTT ఫ్లాట్ఫారం లోకి అడుగుపెట్టనున్న ETV

భారీ పెట్టుబడితో OTT ఫ్లాట్ఫారం లోకి అడుగుపెట్టనున్న ETV

గత సంవత్సర కాలంగా ప్రపంచ వ్యాప్తంగా సినిమా దియేటర్లు చాలావరకూ మూతపడి ఉండడంతో ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న పెద్ద సినిమాల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. కొన్ని కొట్లలో పెట్టిన పెట్టుబడికి వడ్డీలు పెరిగిపోతుండడంతో దిక్కుతోచని స్థితిలో నిర్మాతలు ఉన్నారు.

ఇలాంటి వారికి OTT ఫ్లాట్ఫాం ఒక మంచి చాయిస్ గా మారడంతో కొత్తగా అనేక OTT ప్లాట్ఫామ్లు పుట్టుకొచ్చాయి. వీటిలో “AHA” తో పాటు రాంగోపాల్ వర్మ సైతం “Spark” అనే కొత్త OTT యాప్ ను లాంచ్ చేసారు. రోజు రోజుకూ ఈ ఫ్లాట్ ఫామ్ లకు మంచి ఆదరణ దక్కడంతో “ETV” సంస్థ అధినేత రామోజీరావు గారు సైతం ఈ OTT బాట పట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే “Ushakiran Movies” అనే సంస్థ పై అనేక ప్రతిష్టాత్మకమైన చిత్రాలను నిర్మించిన ఘనత ఆ సంస్థకు ఉండడంతో ఇప్పుడు ఆ సంస్థకు చెందిన పాత చిత్రాలను ఈ OTT ఫ్లాట్ ఫామ్ లోకి వాటిని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అంతేకాక టాలెంట్ ఉన్న యువతకు ఈ ఫ్లాట్ ఫామ్ నుండి మంచి అవకాశాలు దక్కుతాయని తెలుస్తోంది.

ఇక వెబ్ సిరీస్ లతో పాటు ఎప్పటినుంచో “ETV” ని నమ్ముకుని ఉన్న ఆర్టిస్టులకు ఈ OTT  ద్వారా వారి టాలెంట్ నిరూపించుకునే అవకాసం కల్పిస్తుందనే వార్త వినిపిస్తుంది. అయితే ఈ OTT ని తీసుకు రావడానికి 200కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

Read also..సినిమాలు ఫుల్లు.. అప్డేట్స్ నిల్లు….ఇది ప్రభాస్ ఫ్యాన్స్ పరిస్థితి     

 

WhatsApp Group Join Now
RELATED ARTICLES
- Advertisment -

Most Popular