ఢిల్లీ : లాక్ డౌన్ వల్ల దేశంలో అన్ని దుకాణాలు మూతపడ్డాయి. అయితే దాదాపు నెలనుంచి ఇదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ కొన్ని సడలింపులు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మున్సిపల్ ఏరియాస్ లో కొన్ని దుఖాణాలను తిరిగి తెరుచుకునే విధంగా శుక్రవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ప్రాంతాల్లో అక్కడక్కడా విడిగా, దూరంగా ఉన్న దుకాణాలను తెరిచే వెసులుబాటు కలిపించింది.
అయితే ఇలా ఉత్తర్వులమేరకు తెరుచుకున్న దుకాణాలకు కొన్ని సూచనలు కూడా జారీచేసింది. ఆ ఉత్తర్వుల మేరకు తెరుచుకున్న దుఖాణాల్లో సగంమంది అంటే 50 శాతం మంది వర్కర్స్ మాత్రమే పనిలో ఉండాలని సూచించారు. దీనితోపాటు మాస్కులు, గ్లౌజ్ లు ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా వాదాలంటూ పేర్కొన్నారు.
మార్కెట్ ప్రదేశాల్లో మల్టీబ్రాండ్స్, సింగిల్ బ్రాండ్లు, మార్కెట్ ప్రదేశాలు మాత్రం మే 3 వరకూ తెరిచే పరిస్థితి లేదు. ఇవన్నీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సైన్ చేసిన ఈ ఉత్తర్వులు శుక్రవారం రాత్రి విడుదల చేశారు.