ఆదివారం, జూలై 21, 2024
Homeక్రీడలుm s dhoni యు ఆర్ మై "బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్" బ్రావో కొత్త...

m s dhoni యు ఆర్ మై “బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్” బ్రావో కొత్త పాట

టీమ్​ ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీ బ్యాటింగ్ కు ఫిదా అవ్వని వారంటూ ఎవ్వరూ ఉండరు. m s dhoni ఒక్కసారి గ్రీజులో నిల్చున్నాడంటే ప్రత్యర్ధులకు ఇక చుక్కలే.  కెప్టెన్ గా కూడా మిస్టర్ కూల్ గా అనేక మ్యాచ్ లను చివరి నిమిషంలో కూడా మ్యాచ్ స్వభావాన్ని మార్చగల వ్యక్తి m s dhoni.

దోనీకి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫోలోఇంగ్ ఉంది. ఇతర దేశాల ప్లేయర్లు కూడా దోనీని ఇష్టపడతారు. అయితే చెన్నై సూపర్​కింగ్స్​ జట్టులోని ఆల్​రౌండర్​ డ్వేన్​ బ్రావో.. ధోనీ మీదున్న అభిమానాన్ని తాజాగా ఓ పాట రూపంలో చాటుకున్నాడు.

వెస్టిండీస్​ ఆల్​రౌండర్​ డ్వేన్ బ్రావో.. ధోనీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ m s dhoni పై ఓ పాటపాడాడు. ఈ వీడియోను ఐపీఎల్​ జట్టు చెన్నై సూపర్​కింగ్స్ యాజమాన్యం​ తమ ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్​ చేసింది. ఈ వీడియోలో ధోనీని బ్రావో.. “బ్రదర్​ ఫ్రమ్​ అనదర్​ మదర్​” అంటూ వ్యాఖ్యానించి హాస్యాస్పదంగా పలికాడు.

భారత్​లో మహీ, రాంచీలో ధోనీ, చెన్నైలో తలా అని అభిమానులు స్టేడియాల్లో ధోనీని స్మరిస్తారని ఈ పాటలో తెలియజేశాడు. ధోనీ ప్రపంచాన్ని జయిస్తాడని అందులో వెల్లడించాడు. అయితే గ్రౌండ్ లో ఎప్పుడూ విచిత్రంగా ప్రవర్తించే బ్రావో  పలుమార్లు గ్రౌండ్ లో డాన్స్ కూడా చేసేవాడు. ఇక డ్రెస్సింగ్ రూమ్ లో జడేజా, బ్రావో కలిసి పలుమార్లు పాటలు పాడి మిగిలిన ఆటగాళ్లలో నవ్వులు పూయించేవాడు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular