దసరా సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట రామ్ లీలా మైదానంలో రావణ దహనం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. అయితే మన దేశంలో ప్రతీ సంవత్సరం జరిగే పలు వేడుకల్లో రామ్ లీలా మైదాయంలో జరిగే వేడుక కూడా ఒకటిగా నిలుస్తుంది.
ప్రస్తుత పరిస్థితులు ఇప్పుడు ఆ వేడుకలపై కరోనా ప్రభావం పడింది. గత 80 ఏళ్లలో ఇక్కడ వేడుకలు లేకపోవటం ఇదే మొదటిసారి. ఎర్రకోట మైదానం ఏఎస్ఐ పరిధిలోకి వస్తుంది. వారి నుంచి ఇప్పటి వరకు అనుమతి లభించలేదు.
అయితే వేడుకల నిర్వహణకు చాలా సమయం ఉంది. ఈ నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం నిర్దేశించిన నియమాల అనుసరణ ఆచరణాత్మకంగా సాధ్యం కాదు. 80 ఏళ్లుగా ఎర్రకోట మైదానంలో రామ్‌లీలా నిర్వహణ జరుగుతోంది. కానీ కరోనా నేపథ్యంలో ఈ సారి ఆ అవకాశం లేకుండా పోయింది.
దేశంలో మా కమిటీ నిర్వహించే రామ్‌లీలా వేడుకలే పెద్దవి. 600 మందికి పైగా కళాకారులు ఇందులో పాల్గొంటారు. అందులో కొంతమంది ముంబయి నుంచీ వస్తారు. 80 ఏళ్ల ఉత్సవాల చరిత్రలో ఈ వేడుకలు తొలిసారి వాయిదా పడబోతున్నాయని నిర్వాహకులు తెలిపారు.
ఏఎస్ఐ(ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) కార్యక్రమానికి ఇంకా అనుమతి ఇవ్వలేదని వివరించింది. ఒక వేళ అనుమతి వస్తే ఒక్కరోజు వేడుకలు నిర్వహించే అవకాశం ఉందని తెలిపింది.
అయితే ప్రజల ఆరోగ్య పరమైన భద్రతా ముఖ్యమే. అంతేకాక మన దేశంలో అంగరంగ వైభవంగా జరిగే ఒక మంచి దైవ కార్యం ఘటన వల్ల ప్రస్తుతం సామాన్య ప్రజల ప్రాణాలకు ఇబ్బందులు రాకూడదంటూ ఈ ఘటనకు కరోనా కారణం ఎత్తిపరిస్తుతుల్లో కారణం కాకుడదు అని లవ్‌కుశ్ రామ్‌లీలా కమిటీ పేర్కొంది.