మద్యం తాగితే కరోనా పోతుంది .. కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్

0
189
Bharat Singh Kundanpur
Bharat Singh Kundanpur

దేశంలో లాక్ డౌన్ కారణంగా  ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కొంత మంది మాత్రం నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతురు. మనం ఎప్పుడూ సైలెంట్ గా ఉంటె మనల్ని ఎవరూ పట్టించుకోరనో ఏమో అని ఎలా బడితే అలా మాట్లాడుతున్నారు. మొన్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రజల శరీరంలో కరోనా వైరస్ పోవాలంటే క్రిమిసంహారక మందులు శరీరం లోకి ఎక్కిస్తే కరోనా పోతుందేమో ఒకసారి దీనిపై ద్రుష్టిపెట్టండి అని ట్రంప్ అనడంతో శాస్త్రవేత్తలు నోరెళ్లబెట్టారు.

ఇప్పుడు ఇలాంటి ప్రబుద్దుడే ఇండియా లో కూడా ఉన్నారు అతనే రాజస్థాన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ మద్యం తాగితే కరోనా పోతుందంటూ సంచలన వ్యాక్యాలు చేసారు. ఆల్కహాల్ చేతిలో వేసి రుద్దితే (శానిటైజర్) వైరస్ పోతుంది కదా  అలాంటప్పుడు తాగితే కచ్చితంగా వైరస్ చనిపోతుంది కాబట్టి వెంటనే మద్యం దుకాణాలు తెరవాలని సీఎం కు లేఖ రాశారు. దీనితో ఆయన పై సోషల్ మీడియాలో మేమ్స్ చేస్తూ ఆయన్ను ఒక ఆటాడుకున్నారు.