Tuesday, October 20, 2020
Home రాజకీయం ఇక నుంచి ఆ డబ్బు ముట్టుకోం.... సీఎం జగన్

ఇక నుంచి ఆ డబ్బు ముట్టుకోం…. సీఎం జగన్

నేడు ఏపీ సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎస్‌ నీలం సాహ్ని, మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి , మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయకుమార్‌తో, మున్సిపల్‌ శాఖ కార్యదర్శి శ్యామలరావుతో పాటు ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందే విధంగా ఒక ఎస్‌ఓపీ రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలు ఇకపై వాటికి అవే స్వయం సమృద్ధి సాధించాలని సీఎం జగన్ సూచించారు.

మున్సిపాలిటీలనుండి వచ్చే ఆదాయం ప్రభుత్వం వాటి జోలికి వెల్లదని,  ఆ ఆదాయాన్ని అదే   మున్సిపాలిటీలో ఖర్చు చేసే విధంగా అధికారులను ఆదేసించారు. అయామున్సిపాలిటీకి చెందిన గ్రామాలకు కావాల్సిన అభివృద్ధి పనులు, మున్సిపాలిటీ కార్యక్రమాల కోసం ఈ డబ్బును ఖర్చు చేయాలని సూచించారు. ప్రభుత్వం తలపెట్టిన ఈ మంచి కార్యక్రమాన్ని ప్రజలకు చేరువఅయ్యేలా అమలు చేయాలని కోరారు.

 మున్సిపాలిటీలకు చెందిన ఉద్యోగుల జీతభత్యాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పిన సీఎం జగన్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో శానిటేషన్‌ వ్యవస్థలన్నీ అత్యంత పక్డ్బందీగా ఉండాలని ఆదేశించారు. ప్రతి రోజూ పారిశుద్యం పనులు తప్పనిసరి అన్నారాయన. గ్రామాలు, మున్సిపాలిటీలకు చెందిన డ్రైనేజీలను విధిగా శుభ్రం చెయ్యడం తప్పనిసరిగా తెలిపారు.

మున్సిపాలిటీల నుండి వచ్చే ఆదాయం, అభివ్రుద్ధి, ఇంకా ఎలాంటి పనులు చేపడితే మనం మేరుగుపడగలమో ఆ విషయాలు తెలుసుకుని మరింత ముందుకెళ్లాలని తెలిపారు. దానిపై ఎస్‌ఓపీ రూపొందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలందించడంతో పాటుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, అన్ని సమూలంగా అభివృద్ధి చెందే విధంగా ఆ ఎస్‌ఓపీలు ఉండాలని సూచించారు.

Most Popular