శుక్రవారం, మార్చి 31, 2023
Homeఅంతర్జాతీయందొంగ చైనా రాగం మార్చగలదు.. భారత్ తస్మాత్ జాగ్రత్త

దొంగ చైనా రాగం మార్చగలదు.. భారత్ తస్మాత్ జాగ్రత్త

గల్వాన్​ పై  హక్కులు తమవేనంటూ చైనా ఆరోపణలు వాదనలూ ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చినవి కాదని వ్యూహ నిపుణులు ప్రొఫెసర్ ఎం.టేలర్ ఫ్రావెల్ పేర్కొన్నారు. చైనా గవర్నమెంట్ నుంచి సేకరించిన భౌగోళిక మ్యాప్ ల ఆధారంగా దీన్ని ధ్రువీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. తూర్పు వైపు లేదా నది మలుపు వరకు టెరిటోరి తమదేనని బీజింగ్ వాదిస్తోందని స్పష్టం చేశారు.

ప్రస్తుతం సరిహద్దు సైనిక సంక్షోభ సమయంలోనూ అదే వాదనను ముందుకు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. కానీ గతంతో పోలిస్తే ఈ ప్రాంతంలో చైనా యాక్టివిటీస్ కొద్దిగా పెరిగినట్లు వెల్లడించారు. సరిహద్దులో మళ్ళీ పరిస్థితులు చక్కబడాలనే మాట ఇప్పట్లో జరిగేది కాదేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటి పరిస్థితులు చక్కబడి యథాతథ స్థితికి రావాలంటే ముందుగా సైనికులు ఏయే ప్రాంతాల్లో ఉన్నారనే విషయంపై ఏకాభిప్రాయానికి రావాలన్నారు. ఇది చాలా కష్టతరమైన విషయమని తెలిపారు.

రష్యాకు భారత్​,  చైనాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కనుకే ఆ దేశం కూడా తటస్థ వైఖరి  అవలంభించే అవకాశం ఉందన్నారు టేలర్. రెండు అతిపెద్ద దేశాల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు రష్యా తటస్థంగానే ఉంటూ వచ్చిందని గుర్తు చేశారు. వెనక్కి తగ్గింది కానీ అమెరికాతో సంబంధాలు మరింత దారుణంగా మారడం వల్ల భారత్​ విషయంలో చైనా కాస్త వెనక్కి తగ్గిందని టేలర్ పేర్కొన్నారు. భారత్​తోనూ సంబంధాలు దిగజారడం ఇష్టం లేక రాజీ పడుతోందని చెప్పారు. అయితే సరిహద్దులో ఉన్న నేపాల్, భూటాన్ వంటి దేశాలను ఉపయోగించుకొని భారత్​ను ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత్​ మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇవన్నీ ETV Bharat ముఖాముఖీ లో ఆయన వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular