శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeఅంతర్జాతీయంరష్యా S400 కొనకండి మా మిస్సైల్స్ కొనండి భారత్ కు అమెరికా విన్నపం

రష్యా S400 కొనకండి మా మిస్సైల్స్ కొనండి భారత్ కు అమెరికా విన్నపం

భారత్ మరియు రష్యా కుదుర్చుకున్న డిఫెన్స్ డీల్ S400 మిస్సైల్స్ ప్రపంచంలో అత్యంత విద్వంశక మిసైల్ గా దీనికి పేరుంది అందుకే భారత్ ఈ మిస్సైల్స్ ను కొనుగోలు చేయడానికి రష్యా తో ఒప్పందం కుదుర్చుకుంది.

దీనితో అమెరికా స్పందిస్తూ ఒకవేళ ఇండియా S400  వ్యవస్థను రష్యా నుండి కొనుగోలు చేసినట్లయితే భారత్ ను బ్లాక్ లిస్టు లో చేరుస్తామని దీనితో భారత్ అమెరికా మద్య సంబంధాలు క్షీణించే అవకాశం ఉన్నట్లు ట్రంప్ తెలిపారు.

కొన్నాళ్ళక్రితం ఈ విషయమై విదేశాంగ శాకా మంత్రి జై శంకర్ మాట్లాడుతూ మేము ఎలాంటి మిస్సైల్స్ కొనుగోలు చెయ్యాలో మాకు తెలుసునని మాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టి చెప్పారు.

అయితే ఇప్పుడు అమెరికా మరోసారి ఈ డీల్ పై కొన్ని వ్యాఖ్యలు చేసింది. S400 బదులు తమవద్ద ఉన్న పేట్రియాట్ మిసైల్స్ లేదా తాడ్ రక్షణ వ్యవస్థను కొనుగోలు చెయ్యాలని సూచించింది దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

అయితే S400 డీల్ రద్దు చేసే అవకాసం లేదనే చెప్పాలి ఎందుకంటే ఈ డీల్ చివరి దశలో ఉంది అంతే కాక రష్యా తో సంబందాలను ఇంకా మెరుగుపడతాయని యోచిస్తోంది.

america thaad system
america thaad system
america patrit system image

ఎస్ 400 ప్రత్యేకతలు :

మొత్తం డీల్ కరీదు 5.4 బిలియన్ డాలర్లు మిగతా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కంటే ఇది చాలా అడ్వాన్స్డ్ సిస్టం. సుమారు 400 కిలో మీటర్ల  దూరంలోని ఎటువంటి టార్గెట్ అయిన సరే అత్యంత కశ్చితత్వంతో చేదించ గలదు.

ఆకాశ మార్గంలో వచ్చే ముప్పును అనగా ఎలక్ట్రానిక్ వార్ఫార్, స్ట్రాటజిక్ బొమ్బర్స్, స్ట్రాటజిక్ క్రూస్ మిసైల్స్, బాలస్టిక్ మిసైల్స్, డ్రోన్స్, స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్లను నేలమట్టం చేస్తుంది. దీని స్పీడ్ మాచ్ 14, ఈ మిస్సైల్ తో ఒకే సారి 80 టార్గెట్లను ఒకేసారి పర్యవేక్షించ వచ్చు దీనిని యుద్ధ రంగంలో ప్రయోగించడానికి 5 నిమిషాల లోపు దీనిని రెడీ చెయ్యవచ్చు.

అసలు విషయానికొస్తే అమెరికా S400 మిస్సైల్స్ వ్యవస్థను వ్యతిరేకించడానికి కారణాలు లేకపోలేదు. భారత్ ఈ వ్యవస్థను కొనుగోలు చేసిన తరువాత ఈ మిస్సైల్స్ ను పాకిస్థాన్ మరియు చైనా బోర్డర్స్ లో సమకూర్చే అవకాశం ఉన్నందున  ఒకవేళ పాకిస్థాన్, భారత్ కు బాలాకోట్ లాంటి పరిస్థితి ఏర్పడితే అప్పుడు పాకిస్థాన్ కచ్చితంగా అమెరికా నుండి కొనుగోలు చేసిన F-16 యుద్ధ విమానాలను ఉపయోగిస్తుంది.

ఇదేజరిగితే F-16 యుద్ద విమానాన్ని తరిమి తరిమి దానిని నేలమట్టం చేసే సత్తా S400 మిస్సైల్ వ్యవస్థకు ఉంది

Russian s 400
Russian s 400

 

ఇదే కనుక జరిగితే అమెరికా F-16 యుద్ధ విమానాలను కొనే నాధుడే ఉండడు కొన్ని లక్షల బిలియన్ డాలర్లు బూడిదలో పోసిన పన్నీరే. బాలాకోట్ లో ఇంచుమించు ఇదేపరిస్థితి అమెరికాకు ఎదురైంది అప్పట్లో మిగ్ 21 యుద్ద విమానంతో  F-16 యుద్ధ విమానాన్ని కూల్చిన విషయం తెలిసిందే. కొన్నాళ్ళ నుండీ న్యూక్లియర్ అటాక్ చేస్తామంటూ పాకిస్థాన్ కు సంబందించిన మంత్రులు విమర్శిస్తుండడంతో ఈ డీల్ పై ఎంతో ఆసక్తి నెలకొంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular