ఆదివారం, జూలై 21, 2024
Homeఅంతర్జాతీయంకరోనా శృంగారం ద్వారా వ్యాపిస్తుందా.. ? పరిశోధనలో వెల్లడైన షాకింగ్ నిజాలు..!

కరోనా శృంగారం ద్వారా వ్యాపిస్తుందా.. ? పరిశోధనలో వెల్లడైన షాకింగ్ నిజాలు..!

ప్రస్తుత పరిస్థితిలో ప్రపంచ దేశాల ముందు ఉన్న ఏకైక సవాల్ ఒక్కటే కరోనా వైరస్ ను ఎదుర్కోవడం ఎలా, దాన్ని అధిగమించి జీవించడం ఎలా. కానీ కరోనా మాత్రం మనుషులకు ఆ అవకాశం ఇచ్చేలా కనిపించడంలేదు రోజు రోజుకూ దేశాలూ, నగరాలూ, గ్రామాల స్థాయికి వ్యాపిస్తూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక తప్పుడు వార్తలతో ప్రజలు మరింతగా వణికిపోతున్నారు. గాలివల్ల వ్యాపిస్తుందంటూ ఒకరు అంటే దీనిని దృష్టిలో పెట్టుకుని ఇళ్ల తలుపులు కూడా తీయడంలేదు.

ప్రస్తుతం శాత్రవేత్తలు, అధికారులు మాత్రం ఈ వైరస్ గాలి వల్ల వ్యాపించదని చెబుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కరోనా సెక్స్ వల్ల కూడా వస్తుందా అనేది ప్రస్తుతం అందరిలో మరో కొత్త అనుమానంమొలకెత్తింది. దీని పై షాంగిక్యూ మున్సిపల్‌ హాస్పటల్ లో 38 మంది కోవిడ్-19 సోకినా బాధితులపై ఒక అధ్యయనం నిర్వహించి రూపొందించిన నివేదికను జామా నెట్‌వర్క్ నివేదిక వెల్లడించింది.  కరోనా సోకినా ఆరుగురి వీర్యంలో కరోనా వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఇద్దరు కోలుకోగా మరో నలుగురు వైరస్ తో పోరాడుతున్నారు.

కరోనా పాజిటీవ్ నుంచి ఎనిమిది రోజుల కిందట కోలుకున్నవారు సహా  ఈ వైరస్ బారినపడి మూడు నెలలు పూర్తి చేసుకున్న వారి నుంచి వీర్యం సేకరించి అమెరికా మరియు చైనా పరిశోధకులు ఒక అధ్యయనం చేపట్టారు. వీరి వీర్యంలోనూ కరోనా వైరస్‌ను గుర్తించలేక పోయారు.  ప్రధానంగా కరోనా వైరస్‌ బాధితులు దగ్గినా, తుమ్మినా వ్యాపిస్తుందని, అంతేకాక రక్తం మరియు కన్నీళ్ల ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని తెలిపారు.

 ఈ విషయం ఫై ప్రస్తుతం అమెరికా, చైనా పరిశోధకులు పూర్తిస్థాయి అధ్యయనం చేపట్టారు. కరోనాతో తీవ్రంగా భాదపడుతున్న మరికొంత మందిపై పరిశోధన చేయనున్నట్లు ఉతాహ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్‌ జాన్‌ హోట్లింగ్‌ తెలియజేసారు. ఈ అద్సెయయనాలను దృష్టిలో పెట్టుకుని  కరోనా వ్యాప్తి చెందడం లేదని ధీమాగా ఉండటం కంటే అందరం ముందు జాగ్రత్తగా ఉండటమే ఉత్తమమని అమెరికన్‌ సొసైటీ ఫర్‌ రీప్రొడెక్టివ్‌ మెడిసన్ తన‌ తాజా అధ్యయనంలో పేర్కొంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular