ప్రభుత్వానికి ర్యాపిడ్ కిట్ల కమీషన్ల పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు ..Devineni Uma

0
165
devineni uma
devineni uma

రాష్ట్రంలో మెడికల్ టెస్టులు చేస్తున్నా, మెడికల్ క్యాంపులు పెడుతున్నా వీటిలో సోషల్ డిస్టెన్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారని Devineni Uma విమర్శించారు. ముఖ్యమంత్రి ఇంటిచుట్టూ కూడా పాజిటీవ్ కేసులున్నాయన్నారు. నేడు పెన్సన్ దారులకు 50 శాతం పెన్సన్ కట్ చేసి  5లక్షలు తీసుకునే మీ సలహాదారులకు మాత్రం కోటి మూడు లక్షలు విడుదల చేశారన్నారు.

కరోనా వల్ల రాష్ట్రంలో హాస్పటల్స్ లో ఇతర జబ్బులకు సైతం వైద్యం చేయట్లేదని అందువల్ల నిన్న అనంతపురంలో 13 ఏళ్ల చిన్నారిని హాస్పటల్ కు తీసుకెళ్తే వైద్యం చేయకపోవడంతో ఆమె చనిపోయింధన్నారు.

ఇక రైతులను సైతం జగన్ ప్రభుత్వం మోసంచేసిందన్నారు, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామంటూ తీసుకొచ్చిన ధరల స్థిరీకరణ నిధి ఏమైందని మాజీ మంత్రి Devineni Uma ప్రభుత్వాన్ని నిలదీశారు. 3 వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏమయిందని ప్రభుత్వాన్ని నిలదీశారు.

ప్రభుత్వానికి ర్యాపిడ్ కిట్ల కమీషన్ల మీదే శ్రద్ధ ఉందని అన్నారు. రైతులు, పేదవారి సమస్యల మీద పట్టింపు లేదని విమర్శించారు. ప్రభుత్వం కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు కంటతడి పెడుతున్నారని పరిస్థితులు ఇలా ఉంటే  సీఎం జగన్ ఏం చేస్తున్నారని రాష్ట్రం ఎటుపోతుందో తెలియడం లేదని Devineni Uma నిలదీశారు.