ధోనీ పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్

0
422
ms dhoni
ms dhoni

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పై పాకిస్థాన్ కి చెందిన మాజీ ఆటగాడు “డానిష్ ప్రభ శంకర్ కనేరియా” సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇండియా – పాకిస్థాన్ దేశాల మద్య క్రికెట్ మ్యాచ్ లు జరగని నేపద్యంలో ఇప్పుడు కనేరియా చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ క్రికెటర్లకు మింగుడు పడడం లేదు.

పూర్తి వివరాల్లోకి వెళితే ధోనీ ఇప్పటికే వన్డే క్రికెట్, టేస్ట్, టీ-20 ఫార్మాట్లకు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించగా ఒక్క ఐపీఎల్ లో మాత్రం కొనసాగుతున్నాడు. అయితే ధోనీ భవిష్యత్తులో ఇతర మాజీ క్రికెటర్ల లాగ కాకుండా ఇండియా టీం కి కోచ్ గా ఎక్కువ ఇష్టపడతాడంటూ వ్యాఖ్యలు చేసాడు. కనేరియా చేసిన వ్యాఖ్యలకు పాకిస్థాన్ మాజీ ఆటగాళ్ళు గుర్రుగా ఉన్నారని సమాచారం.

ఒకవిధంగా చెప్పాలంటే పలు సందర్భాల్లో పాకిస్థాన్ కు చెందిన ఆటగాళ్ళలో చాలా మంది ధోనీ కెప్టెన్సీ లో భారత్ కు తిరుగుండదంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేసిన సందర్భాలుంటే ఇంకొంతమంది ధోనీ లాంటి క్రికెటర్ పాకిస్థాన్ జట్టులో ఒక్కడున్నా చాలంటూ ధోనీ ని కొనియాడారు.  ఏదేమైనా కనేరియా వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

Read Also..  టోక్యో ఒలింపిక్స్ లో తెలుగు తేజం PV Sindhu ఘనవిజయం