Sri Lanka vs India : నిన్న జరిగిన భారత్ శ్రీలంక రెండోవ వన్డే మ్యాచ్ అనుకోని మలుపులతో ఉత్కంఠ పరిస్థుతుల మద్య బారత్ మ్యాచ్ ను సొంతం చేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే మంగళవారం జరిగిన రెండో వన్డే లో మొదటి బ్యాటింగ్ కి దిగిన శ్రీలంక 276 పరుగులు చేసి 277 పరుగుల లక్ష్యాన్ని భారత్ కు ఇవ్వగా 35.1 ఓవర్లకే 193 పరుగులు చెసి 7 వికెట్లను భారత్ కోల్పోయింది.
ఇక టాప్ ఆర్డర్ లో సుర్యకుమార్ యాదవ్ 44 బంతుల్లో 53 పరుగుల మినహా టాప్ ఆర్డర్ మొత్తం విఫలమవ్వడంతో మ్యాచ్ పై పూర్తిగా ఆసలు వేదిలేసుకున్నారు. అయితే ఎనిమిదొవ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన Deepak Chahar మొత్తం మ్యాచ్ రూపు రేఖల్ని మార్చేశాడు.

Sri Lanka vs India Match
శ్రీలంక బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ 82 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్స్ సాయంతో 69 పరుగులు చేసాడు. ఇక చాహర్ తో పాటు భువనేశ్వర్ కుమార్ 28 బంతుల్లో 19 రన్స్ చేసి చాహర్ కు సాయంగా నిలబడ్డాడు. ఇంకా బంతులు మిగిలుండగానే భారత్ ను అజేయంగా గెలిపించాడు చాహర్.
భూవీ, చాహర్ ఇద్హరూ కలిసి ఎనిమిదవ వికెట్ కి 84 బంతుల్లో 84 పరుగులు చెయాడం పై క్రికెట్ పండితులు, అబిమానులు ఈ మ్యాచ్ పై ఆనందం వ్యక్తం చేస్తూ దీపక్ చాహర్ క్రీజులో కనబరచిన పోరాట పటిమను ప్రశంసిస్తున్నారు. ఇక మూడు వన్డేల సిరీస్ లో బాగంగా రెండు మ్యాచ్ లను భారత్ సొంతం చేసుకుంది.