సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పై రాజస్థాన్ రాయల్స్ (RR) సిక్సర్ల మోత:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL -2022 లో బాగంగా నిన్న వాంఖడే స్టేడియంలో హైదరాబాద్ మరియు’ రాజస్థాన్ రాయల్స్ కు Sunrisers Hyderabadమద్య జరిగిన మ్యాచ్ లో మొదటిగా బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. వీరిలో సంజు శాంసన్ 55 (27), దేవదత్త పదిక్కల్ 41 (29), జాస్ బట్లేర్ 35 (28), హిట్ మేయర్ 13 బంతుల్లో 32 పరుగులు చేసారు. సిక్సర్ల సునామీలాగ హైదరాబాద్ జట్టుపై విరుచుకు పడ్డారు రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ ను ఏదశలోనూ నిలువరించలేకపోయింది Sunrisers జట్టు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పేలవమైన ప్రదర్శన:
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ లో కూడా అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. రాజస్థాన్ బేట్స్ మెన్స్ సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతున్నా వారిని నిలువరించి వెకెట్లు తీయడంలో హైదరాబాద్ జట్టు విఫలమైందనే చెప్పాలి. ఇక బ్యాటింగ్ లోనైనా ఆ జట్టు ఏమైనా ఆకట్టుకుంటుందా అంటే అదీలేదు ఒక దశలో 100లోపు పరుగులకే ఆల్ అవుట్ అవుతుందేమో అనుకునే సమయంలో మార్కం 57 (41), వాషింగ్టన్ సుందర్ 40 (14) తో ఆ జట్టుని ఆదుకునే ప్రయత్నం చేసారు చివరికి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు మాత్రమె చేయగలిగింది.
సన్‌రైజర్స్ పై అభిమానుల విమర్శలు:
మొదటగా సన్‌రైజర్స్ టీమ్ గురించి మాట్లాడితే ఒకటి, రెండు IPL సీజన్ల మినహా ఒక్క సీజన్ లో కూడా సరైన ప్రదర్శన కనబరచిన దాకలాలు లేవు. చాలా సీజన్లలో పేలవ ప్రదర్శన చూపి మొదటిగా ప్లేఆఫ్ కి వెల్లింది సన్‌రైజర్స్ టీమ్. అసలు సన్‌రైజర్స్ టీమ్ కి ప్లేయర్ల కొనుగోలు చెయ్యడం అసలు తెలుసా అంటూ ఫ్యాన్స్ సన్‌రైజర్స్ యాజమాన్యం పై విమర్శలు చేస్తున్నారు. ప్లేయర్లలో బౌలర్స్ మినహా సరైన బేట్స్ మేన్ ఒక్కడిని కూడా కొనుగోలు చేయకపోవడంతో సన్‌రైజర్స్ మ్యాచ్ చూసేవారు సైతం అంతగా ఇంట్రెస్ట్ చూపించడంలేదు. ఇప్పటికైనా సరైన ఫెర్ఫామేన్స్ చూపించకపోతే మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు పరాభవం తప్పదు.