ఆదివారం, జూలై 21, 2024
Homeజాతీయంమద్యం అమ్మకాల్లో నేడు కొత్త రికార్డ్

మద్యం అమ్మకాల్లో నేడు కొత్త రికార్డ్

మద్యం అమ్మకాల్లో నేడు కొత్త రికార్డ్ .. వైన్  షాపుల ముందు మందుబాబులు రాష్ట వ్యాప్తంగా క్యూ కట్టారు మద్యం షాపులు కంటెన్మెంట్ జోన్లో ఉన్న 15 మినహా 2200 షాపులు ఓపెన్ అయ్యాయి. ఈ రోజు ఉదయం 10 గంటలు నుండి సాయంత్రం 6 గంటలు వరకు మద్యం అమ్మకాలు జరిగాయి. మద్యం షాపులు ముందు జనం కిలో మీటర్ల మేర క్యు కట్టి నుంచున్నారు.

అయితే ప్రభుత్వం మద్యం ధరలు 16% శాతం పెంచింది. తెలంగాణ హైదరాబాద్ లోని మద్యం షాపులు తెరవడంతో అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమానంగా మద్యం కొనుగోలు కోసం క్యూలో నుంచోవడం గమనార్హం . వీరి కోసం ప్రత్యకంగా లైన్ లు కూడా పెట్టారు. మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, ఫీనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో మద్యం కోసం అమ్మాయిలు క్యూకట్టారు.

ఇక మందుబాబులు అంతా ఒకేసారి పోటెత్తడంతో కొన్ని షాపుల్లో స్టాక్ అయిపోయింది. మందు దొరికిన వారి ఆనందానికి అవధులే లేవు ఇక మద్యం దొరకనివారు నిరాశతో వెనుదిరిగారు. సమాచారం ప్రకారం 43 కోట్ల మద్యం అమ్ముడయిందని అంచనా.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular