కరోనా వ్యాక్సిన్ సక్సెస్… కరోనాపై భారీ విజయం

0
117
corona vaccine success
corona vaccine success

కరోనా తీవ్రత ప్రపంచ దేశాలకు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుంది దీనిని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు కరోనా వ్యాక్సిన్ తయారీలో బాగంగా కంటిమీద కునుకు లేకుండా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్ తయారీ ప్రక్రియ పూర్తి చేసాయి. అయితే హ్యూమన్ ట్రయల్స్ లో మాత్రం మొదటి దశలోనే ఉన్నాయి వీటిలో భారత్, రష్యా, అమెరికా, చైనా వంటి దేశాలు హ్యూమన్ ట్రయల్స్ మొదలుపెట్టాయి.

అయితే ఆక్స్ ఫర్డ్ యూనివెర్సిటీ తయారు చేసిన “ChAD0x1 nCoV19″ అనే వ్యాక్సిన్ తయారీతో పాటు హ్యూమన్ ట్రయల్స్ కూడా తాము పూర్తి చేసినట్లు మరియు ఈ వ్యాక్సిన్ ఫలితాలు చాలా బాగున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాక మనుషులపై చేసిన మొత్తం రెండు దశల ట్రయల్స్ లో రోగనిరోధక శక్తీ బాగా పెరిగినట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్ తో శరీరంలో యాంటీ బాడీలు బాగా పెరగడం వల్ల అవి కరోనా వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయని తెలిపారు.

తమ పరిశోధనల్లో ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత జ్వరం, తలనొప్పి వంటివి మినహా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తెలిపారు. అయితే ఈ వ్యాక్సిన్ శరీరంలోకి ఇచ్చిన తరువాత ఇది ఎన్నాళ్ళు పనిచేస్తుందనే విషయం పై మరిన్ని ప్రయోగాలు చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు.