కరోనా వైరస్ అనే ఈ మాట ప్రపంచాన్ని వణికిస్తోంది. యావత్ ప్రపంచమంతా ఈ వైరస్ ని అంతమొందించే మందుకోసం పాకులాడుతోంది ఒకరకంగా చెప్పాలంటే ప్రపంచం అంతా కలిసి ప్రయత్నిస్తోందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించిన మందును మన భారత కంపెనీ తయారుచేసింది అవును కరోనా వైరస్ కు మందు సిద్ధమైంది.
ముంబైకి చెందిన గ్లేన్మార్క్ అనే వ్యాక్సిన్ తయారీ సంస్థ తీసుకొచ్చిన ఫాబిఫ్ల్యూ అనే టాబ్లెట్ కు DCGI ద్వారా ఆమోదం లబించింది. కోవిడ్ తో బాధపడుతున్న రోగులు ఇవి రోజుకి రెండుసార్లు 1,800 ఎంజీ చొప్పున టాబ్లెట్ తీసుకోవాలని తరువాత 14 రోజులు 800 ఎంజీ టాబ్లెట్ రోజుకు రెండుసార్లు తీసుకోవాలని తెలిపింది. షుగర్, గుండెసమస్యలు ఉన్నవారు కూడా ఈ టాబ్లెట్స్ వేసుకోవచ్చట. దీని ధర కేవలం 103 రూపాయలని అంటున్నారు..