ప్రస్తుత పరిస్థితుల్లో పీఎం కేర్స్ కి విరాళాలు ఇచ్చేందుకు చాలామంది ముందుకొస్తున్నారు ఇలాంటి తరుణాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు సైబర్ నేరగాళ్లు తప్పుడు ఐడీలతో విరాళం ఇవ్వాలనుకుంటున్న వాళ్లను బురిడీ కొట్టించి డబ్బు కాజేయాలని చూస్తున్నారు.
ప్రధాని మంత్రి అత్యవసర పౌర సహాయ, పునరావాస నిధి ( పీఎం కేర్స్)కి విరాళాలు కోరుతూ కొందరు నకిలీ యూపీఐ ఐడీల ద్వారా ప్రజల నుంచి ఆన్ లైన్ లో విరాళాలు సేకరిస్తున్నట్టు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ( సీఈఆర్ టీ) బృందం హెచ్చరించింది.
పీఎం కేర్స్ అసలు ఐడీని పోలిన విధంగా PNB, HDFC BANK, ICICI, YES BANK తదితర బ్యాంకుల యూపీఐ హ్యాండిల్ నుంచి నకిలీ ఐడీలను స్రుష్టించిన విషయం తమ ద్రుష్టికి వచ్చినట్టు తెలిపింది. pmcares@sbi మాత్రమే నిజమైన ఐడీ అని పేర్కొంది. దాతలు విరాళాలను అందజేసేంముందు ఐడీని సరిచూసుకోవాలని కోరింది.
ఇక CERT పేర్కొన్న నకిలి ఐడీలు ఇవి.
pmcares@pnb, pmcares@hdfcbank
pmcare@yesbank, pmcare@ybl
pmcare@upi, pmcare@sbi మరియు pmcare@icici
ఇవి నకిలీ ఐడీలుగా గుర్తించారు కాబట్టి మీరు విరాళాలు ఇచ్చేముందు ఆ ఐడీలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవడం మంచిది.