కేసీఆర్ సంచలన నిర్ణయం..ప్రజలందరికీ ఇంటి వద్దే వైద్య పరీక్షలు

0
140
corona tests at house in telangana
corona tests at house in telangana

తెలంగాణా సీఎం కేసీఆర్ మాటలు ఎప్పుడూ ముక్కు సూటిగా ఉంటె తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సంచలనంగా ఉంటాయి. కరోనా ఎఫెక్ట్ తో రాష్ట్రం లో కేసుల సంఖ్య అదికంగా పెరగడంతో పలుమార్లు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బ్రతికుంటే తలో కుంత గెంజి తాగి బతకొచ్చు అంటూనే పలు రాష్ట్రాల సీఎంలు ప్రదానితో మాట్లాడినప్పుడు సైతం లాక్ డౌన్ పెంచాల్సిందేనని ప్రదానికి కరాఖండీగా చెప్పేశారు.

KCR Press Meet

మిగతా రాష్ట్రాల సీఎంలు ఆర్దిక మందగమనం నేపద్యంలో లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినా కేసీఆర్ మాత్రం స్వతహాగా లాక్ డౌన్ పెంచి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం లో ప్రస్తుతం కరోనా కేసులు మునుపటి కంటే ఎక్కువవ్వడంతో ఇంకో సంచలన నిర్ణయానికి ముందడుగేసారు. కరోనా లక్షణాలున్న రోగులు హాస్పటల్ కి వచ్చే సరికి వైరస్ వారితో పాటు ఆ చుట్టుపక్కల వాళ్లకు కూడా సోకి అది దావానంలా వ్యాపిస్తుండడంతో.

కరోనా నివారణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఎన్ని సార్లు మీడియా సమావేశాలు పెట్టినా ఫలితం లేకపోవడంతో కేసీఆర్ రాష్ట్రమంతా  వైద్య పరీక్షలు ఇంటివద్దకే వెళ్లి చెయ్యాలని నిర్ణయించారు. దీనిపై ఈటెల రాజేందర్ మెడికల్ ఆఫీసర్స్, హాస్పటల్స్ సూపరిడేన్స్ కు 100 ఇళ్ళకు ఒక ఏఎన్ఎం ను కేటాయించి రాష్ట్రం లో దగ్గు, గొంతునొప్పి, జ్వరం, జలుబు, ఊపిరితిత్తుల వ్యాదుల లక్షణాలున్న వారిపై రాష్ట్ర వ్యాప్తంగా వైద్య పరిక్షలు చెయ్యాలని ఆదేశించారు.