బుధవారం, అక్టోబర్ 4, 2023
Homeజాతీయంగాంధీ ఆస్పత్రిలో కరోనా సోకిన గర్భిణి ప్రసవం.., ఎలా ఉన్నారో తెలుసా

గాంధీ ఆస్పత్రిలో కరోనా సోకిన గర్భిణి ప్రసవం.., ఎలా ఉన్నారో తెలుసా

ప్రసవం అంటేనే పునర్జన్మ.. ఎంతో వేదన కానీ తల్లి ఆ నొప్పులను కూడా ఎంతో ఓర్పుగా భరిస్తూ తన బిడ్డ కోసమై పరితపిస్తుంటుంది. ఇలాంటి ప్రసవ వేదన ఒకెత్తయితే ఆ గర్భిణికి కరోనా ఉంటే పరిస్థితి ఏంటి..? ఇలాంటి సమయంలో డాక్టర్స్ ఆ గర్భిణికి పురుడుపోయడం డాక్టర్స్ కి కత్తిమీద సామే..! సరిగ్గా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో. కరోనా సోకి చికిత్స పొందుతున్న నిండు చూలాలికి విజయవంతంగా పురుడుపోశారు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు.

హైదరాబాద్  ఫలక్నామాకు చెందిన 22 ఏళ్ల మహిళకి కరోనా సోకడంతో కింగ్ కోఠిలో చికిత్స పొందుతోంది ఆమె నిండు గర్భిణీ. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో పురిటినొప్పులు రావడంతో ఆమెను హుటాహుటీన గాంధీ ఆస్పత్రికి తరలించారు.. అక్కడ సాధారణ ప్రసవం కోసం ప్రయ్నతించగా పరిస్థితి అనుకూలించకపోవడంతో శుక్రవారం ఉదయం ఆమెకు సిజేరియన్ చేశారు. తల్లి, బిడ్డ ఆరోగ్యాంగా ఉన్నారు. పుట్టిన బిడ్డ

బరువు మూడుకిలోలు ఉందని పూర్తీ ఆరోగ్యంతో ఉందని కాకపోతే కరోనా పరీక్షలకోసం శాంపిల్స్ తీసి ల్యాబ్ కు పంపించామని డాక్టర్స్ తెలిపారు.. ఇక బాలింత కుటుంబసభ్యులకు కరోనా నిర్ధారణ కావడంతో వాళ్లకు చికిత్స అందిస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో కరోనాతో ప్రసవం ఇదే మొదటిదని అధికారులు అంటున్నారు.. ఆ తల్లీబిడ్డా క్షేమంగా ఉండాలని అంతా దేవుడిని ప్రార్థిస్తున్నారు.

WhatsApp Group Join Now
RELATED ARTICLES
- Advertisment -

Most Popular