కరోనా గుట్టు తేల్చిన భారత్.. ఒకటి కాదు 11 వైరస్ ల కలయిక.

0
222
corona is 11 different viruses
corona is 11 different viruses

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇప్పటికే విశ్వంలో కొరకరాని కొయ్యగా మారింది. ఇది భయంకరంగా వ్యాపిస్తూ దాని సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తూనే ఉంది కరోనా వైరస్. ఇక ఈ నేపథ్యంలోనే  కోవిడ్ -19 పై అనేక కొత్త వార్తలు సంచలనాలు రేపుతున్నాయి. 2019 డిసెంబర్ నెల నుంచి ఏప్రిల్ వరకు  కరోనా విస్తరిస్తున్న అనేక దేశాల్లో కరోనా శాంపిల్స్ సేకరించిన భారతదేశ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ పై అనేక కొత్త విషయాలను బయటకి తీశారు. వైరస్ కి సంబంధించిన వివిధ దశలపై పరిశోధనలు కూడా నిర్వహించారు.

భారత శాస్త్రవేత్తలు చేసిన పలు రకాల పరిశోధనల్లో ఆశ్చర్యానికి గురిచేసే నిజాలు ఇప్పుడు బయటపడ్డాయి. కరోనా వైరస్ అనేది ఒక్కటి కాదనీ,  దీనిలో పదకొండు రకాల వైరస్ లు కలిసి ఉన్నాయని, వాటిల్లో ఏ2ఏ అనే కరోనా వైరస్ అత్యంత ప్రమాదకమైనది అని భారతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు.ఇది చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన వైరస్ ’O’ అనే రకం వైరస్ అని దాని తరువాత ఆ వైరస్ నుండి 11 రకాల మరిన్ని వైరస్ లు ఉద్భవించాయని మొత్తం 11 రకాల వైరస్ లలో ఏ2ఏ అనే వైరస్ అన్నింటికంటే శక్తివంతంగా చాలా బలంగా ఉందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

 ఈ వైరెస్ శరీరంలోకి ఒక్కసారి ప్రవేశించిన తరువాత అది ఊపిరితిత్తుల్లో తయారయ్యే ‘ఏసీఈ2’ అనే పోషకాన్ని గట్టిగా అంటిపెట్టుకొని ఉంటుంది. ఆ తరువాత అక్కడి నుంచి ఈ పోషకం లోపలి వరకూ చేరి దాన్ని కబళించి వేస్తుంది. తర్వాతి దశలో అది ఊపిరితిత్తులను పూర్తిగా నాశనం చేస్తుందని ఫలితంగా మరణం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కరోనాని అరికట్టాలంటే మొత్తం పది రకాల వైరస్ లకు వ్యాక్సిన్ కనుగొనాలని ఇలా అయితేనే కరోనా వైరస్ ను సమూలంగా అరికట్టగలమని శాస్త్రవేత్తలు అబిప్రాయపడుతున్నారు.