బుధవారం, అక్టోబర్ 4, 2023
Homeఅంతర్జాతీయంజాబ్ పోయేనా..? కొత్త సర్వేలు ఏమంటున్నాయంటే

జాబ్ పోయేనా..? కొత్త సర్వేలు ఏమంటున్నాయంటే

ఓ వైపు కరోనా కబళిస్తోంది మరోవైపు లాక్ డౌన్ కడుపుమాడుస్తోంది. ఇక రోజువారీ పనులు చేసుకునే కూలీల పరిస్థితి అయితే ఇక చెప్పనక్కర్లేదు ఇదిలా ఉండగా ఉద్యోగుల వ్యద చూస్తే వర్ణనాతీతం ఎక్కడివక్కడే స్థంభించిపోవడం వల్ల కంపెనీలకు వర్క్ లేకుండా పోయింది. దింతో అసలు ఉద్యోగాలు ఉంటాయా ఉడతాయా అనే కన్ఫ్యూజన్ ప్రజల్లో నెలకొంది. ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోవడంతో ప్రతీ వారికీ ఉద్యోగ భయం పట్టుకుంది.

ఈ నేపథ్యంలోనే బ్రిటన్​కు చెందిన క్రాస్బీ టెక్స్​టర్​ అనే సంస్థ ఈ సర్వే నిర్వహించింది. ఏప్రిల్​ 23 నుంచి 27 వ తారీకుల మధ్య ఆన్​లైన్​లో ఒపీనియన్ పోల్​ ద్వారా వివరాలు సేకరించింది. భారత్​లో 86 శాతం మందిలో ఉద్యోగ భయం ఉండగా, బ్రిటన్​లో మాత్రం 31 శాతం మంది మాత్రమే ఆందోళన చెందుతున్నారని తెలిపింది.

ఆస్ట్రేలియాలో 33 శాతం మరియు అమెరికాలో 41 శాతం మంది జాబ్ పోతుందని బెంగ పెట్టుకున్నారు. అటు హాంగ్​కాంగ్​ లోనూ అధికంగా 71 శాతం మంది ఉద్యోగం కోల్పోతామని భయపడుతున్నారని తెలిపింది.

ఇక భారతీయుల్లో కరోనా పరిస్థితుల్లో తమ ఉద్యోగం ఉంటుందో పోతుందోనని 86 శాతం మంది వరకూ భయాందోళనలో ఉన్నట్టు  బ్రిటీష్ సంస్థ చేసిన సర్వేలో వెల్లడించింది. తమ చేతికాడ కూడు ఎవరో లాగేసినట్టు ఉన్న ఉద్యోగాలు పోతాయేమో అని అందరు భయపడుతున్నారు. సాఫ్ట్ వేర్ రంగమైతే అసలు ఎప్పుడు ఏం జరుగుతుందా అన్నట్టు తయారయ్యింది.

కొంతమంది సగం జీతాలిస్తుంటే మరి కొంతమందికి మాత్రం అసలు ఇతర దేశాల నుంచి ప్రాజెక్ట్స్ వస్తాయా లేదా అనే అయోమయంలో పడి కొట్టుకుంటున్నారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా ప్రజలు మాత్రం వారి జాబ్​ విషయంపై అంత ఆవేదన చెందడం లేదని ప్రముఖ సర్వే పేర్కొంది.

WhatsApp Group Join Now
RELATED ARTICLES
- Advertisment -

Most Popular