శుక్రవారం, మార్చి 29, 2024
Homeజాతీయంకన్నీరు పెట్టిన లారెన్స్ 21 మంది చిన్నారులకి కరోనా..

కన్నీరు పెట్టిన లారెన్స్ 21 మంది చిన్నారులకి కరోనా..

హీరో మరియు డైరెక్టర్, డాన్స్ మాస్టర్ అయిన లారెన్స్ పేదల పట్ల మరియు  అనాధలపట్ల చాలా ఉదారభావంతో ఉంటారు. ఎంతోమంది వికలాంగులకు అయన సాయపడ్డారు కూడా అయితే ఇటీవల కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ఆ మహమ్మారి లారెన్స్ నిర్వహిస్తున్న సొంత ట్రస్ట్ లో 21 మందికి సోకింది. తన ట్రస్ట్ లో 21 మంది కరోనా బారిన పడ్డారని‌ రాఘవ లారెన్స్‌ అన్నారు. ప్రస్తుతం వాళ్ళు  కోలుకుంటున్నారని, ప్రతిఒక్కరూ వారి కోసం ప్రార్థించాలని కోరారు.

అనాథ చిన్నారుల కోసం నేను ట్రస్ట్‌ నిర్వహిస్తున్నా. వారం రోజుల క్రిందట  ట్రస్ట్‌లోని కొంతమంది చిన్నారుల్లో జ్వరం ఇతర కొవిడ్‌-19 లక్షణాలు కనిపించడంతో. హుటా హుటిన  వారికి కరోనా టెస్టులు చేయించగా వారిలో 18 మంది చిన్నారులకు, ముగ్గురు సిబ్బందికి పాజిటివ్‌ వచ్చినట్లు  నిర్ధారణ అయిందట. పాపం ఆ ముగ్గురు సిబ్బందిలో ఇద్దరు దివ్యాంగులు. ఈ వార్త నన్ను ఎంతగానో బాధకు గురిచేసిందని బాధపడ్డారు లారెన్స్. అయితే వాళ్లు త్వరగా  కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.

కరోనాపై పోరాటం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, సినీ పరిశ్రమలోని కార్మికుల సంక్షేమం కోసం రాఘవ లారెన్స్‌ ఇప్పటికే రూ.3 కోట్లను విరాళంగా ఇచ్చారు. దీనితో పాటే లాక్ డౌన్ వళ్ళ  ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సైతం తన వంతు సాయమందించారు. తన ట్రస్ట్ లో పిల్లల గురించి విషయం తెలిసిన వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకున్న ఎస్పీ వేలుమణికి ధన్యవాదాలు. నేను చేసిన సేవ, సాయం నా చిన్నారులను కాపాడుతుందని భావిస్తున్నా. చిన్నారులు త్వరగా కోలుకోవాలని ప్రతిఒక్కరూ దేవుడ్ని ప్రార్థించండి అంటూ రాఘవ లారెన్స్‌, ప్రముఖ దర్శకుడు, నృత్య దర్శకుడు కోరారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular