బుధవారం, అక్టోబర్ 4, 2023
Homeజాతీయంజీతాలు, ఉద్యోగాలపై కంపెనీలు కీలక నిర్ణయం ఇదే

జీతాలు, ఉద్యోగాలపై కంపెనీలు కీలక నిర్ణయం ఇదే

నిత్యావసరాలు తప్ప ప్రస్తుతం బయట ఎం దొరకనిపరిస్థితి ఇవికూడా కేవలం నిర్నీత సమయంలో మాత్రమే దొరుకుతున్న పరిస్థితి. కోవిడ్-19 ని కట్టడిచేయడానికి  దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఇలా ఎక్కడికక్కడ బంద్ అయిపోవడంవల్ల రాబోయే కాలంలో రాబోయే 6 నెలల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని 57 శాతం సంస్థలు భావిస్తున్నాయి. ఇక  46 శాతం కంపెనీలైతే ఈ పరిస్థితి ఏడాది వరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నాయని గ్లోబల్‌ అడ్వైజరీ సంస్థ విల్లిస్‌ టవర్స్‌ వాట్సన్‌ సర్వే పేర్కొంది.

వర్క్​ ఫ్రం హోం కు 83 శాతం ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని పరిశీలిస్తున్నాయి. దీనికై ఇంకా ఖచ్చితమైన నిర్ణయం అలాగే ఆ తేదీని నిర్ణయించలేదని 55% సంస్థలు తెలిపాయి. ఇక 17 శాతం మంది 2020 దీర్ఘకాల జీతాల పెంపుదలపై ప్రభావం ఉంటుందని వెల్లడించారు. 2020, మార్చి 20-31 మధ్య 103 సంస్థలు పాల్గొన్నాయని పేర్కొన్నారు. వేర్వేరు రంగాలకు చెందిన 4,17,000 ఉద్యోగుల నుంచి సమాచారం సేకరించారు.

కొన్ని కంపెనీలు ప్రణాళికా ప్రకారమే జీతాలు  పెంపు ఉంటుందని 33% కంపెనీలు చెప్పడం మరికొన్ని  జీతాలపెంపు విషయంలో చాలా గందరగోళం ఉంది. రాబోయే రోజుల్లో  జీతాల పెంపుపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని 42% సంస్థలు పేర్కొన్నాయి. కొన్ని సర్వేల ప్రకారం 2020 బోనస్‌లపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారని విల్లిస్‌ టవర్స్‌ సంస్థ తెలిపింది.

WhatsApp Group Join Now
RELATED ARTICLES
- Advertisment -

Most Popular