మంగళవారం, ఫిబ్రవరి 7, 2023
Homeఅంతర్జాతీయంఆ మందు వాడటం వల్లే కరోనా మరణాలట..! అగ్ర రాజ్యం షాక్

ఆ మందు వాడటం వల్లే కరోనా మరణాలట..! అగ్ర రాజ్యం షాక్

కరోనా వైరస్ వ్యాప్తి ప్రపంచాన్ని వణికిస్తున్న  తరుణంలో అగ్ర రాజ్యం అమెరికా కూడా ఈ కరోనా వైరస్ దెబ్బకి చతికిల పడిపోయిన విషయం తెలిసిందే. సరిగ్గా అదే సమయంలో తెరపైకి వచ్చింది హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇది కరోనావైరస్ పై వైద్యానికి బాగా సహకరిస్తున్నట్టు వైద్యులు అంచనా వేయడంతో అమెరికా ప్రెసిడెంట్  డొనాల్డ్​ ట్రంప్​ కూడా  ఈ డ్రగ్​ను వైరస్​ అరికట్టడంలో ‘గేమ్ ఛేంజర్’​గా అభివర్ణించారు. అయితే ఇప్పుడు  అమెరికా పరిశోధకులు చెబుతున్న విషయాలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది.

కరోనా రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్​తోనే ఎక్కువ ప్రాణహాని  ఉందని పరిశోధకులు అంటున్నారట. ఈ డ్రగ్​తో చికిత్స అందించిన రోగుల్లో 27 శాతం కన్నా ఎక్కువ మంది మరణించగా, క్లోరోక్విన్​-హైడ్రాక్సీ క్లోరోక్విన్ కాంబినేషన్​లో చికిత్స అందించిన రోగుల్లో 22శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ డ్రగ్స్​ను వాడని కరోనా రోగుల మరణాల రేటు మాత్రం 11.4 శాతమే ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది.

ఈ మరణాల రేషియోలో తేడారావడానికి కారణం హైడ్రాక్సీ క్లోరోక్విన్​ కరోనా రోగుల్లో ప్రతికూల ప్రభావం చూపుతోందని దానికి సంబంధించిన అధారాలున్నట్లు అమెరికా ఫుడ్​ అండ్ డ్రగ్​ అడ్మినిస్ట్రేషన్​(ఎఫ్​డీఏ) గతనెలలోనే హెచ్చిరించింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్​ను పరీక్షించకుండా వినియోంగించేందుకు అనుమతించ వద్దని హెచ్చరించిన మాజీ వ్యాక్సిన్​ ఉన్నతాధికారి రిక్​ బ్రైట్​ను గతనెలలోనే పదవి నుంచి తప్పించింది ట్రంప్ ప్రభుత్వం. కరోనా చికిత్సకు దీనిని తక్షణమే వినియోగించాలని శాస్త్రవేత్తలపై శ్వేతసౌధం వారిపై ఒత్తిడి తెచ్చినట్లు రిక్ ఆరోపించారు.

హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు వినియోగాన్ని తక్షణమే దీనిని నిలివేసేలా త్వరగా  చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అక్కడి డ్రగ్​ నిపుణులు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెబుతున్నారు. ఈ డ్రగ్​ను అత్యవసరంగా వినియోగించవచ్చని అనుమతిచ్చిన కొద్ది వారాలకే ఎఫ్​డీఏ ఈ ప్రకటన చేసినట్లు వాషింగ్టన్​ పోస్ట్​ తన వార్తలో  ప్రచురించింది.

RELATED ARTICLES

Most Popular