తూర్పుగోదావరి జిల్లాలోని శంఖవరం మండలంలో కరోనా కలకలం రేగింది కత్తిపూడి గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా నిర్ధారణ అయినట్టు డిఎమ్ హెచ్ ఓ సత్యసుశీల తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి గతనెల ఉగాదిన కుటుంబంతో కలిసి విశాఖ నుంచి కత్తిపూడి వచ్చినట్టు తెలిసింది. జ్వరం రావడంతో వైద్యులు కరోనా పరీక్షలు చేశారు ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకినట్టు తేలింది. బాధిత కుటుంబాన్ని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.
కత్తిపూడిలో ఆ పరిసరాల్లో ఉండే 38 మంది వద్ద నమూనాలు సేకరించారు. అక్కడివారంతా ఇళ్లలోనే క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. అయితే ఇప్పటికి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 12 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా 349 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రతిజిల్లాలో కరోనా లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. కర్నూలులో 75
గుంటూరు జిల్లాలో 49
నెల్లూరు జిల్లాలో 48
కృష్ణా జిల్లాల్లో 35
కడప జిల్లాలో 28
ప్రకాశం జిల్లాలో 27
పశ్చిమ గోదావరి జిల్లాలో 22
విశాఖ, చిత్తూరు జిల్లాల్లో 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 12 కేసులు గుర్తించారు. అయితే ఇప్పటివరకూ నలుగురు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు..ఇక 9 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు..