మంగళవారం, నవంబర్ 28, 2023
Homeజాతీయంప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళం లోనూ కరోనా

ప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళం లోనూ కరోనా

ప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళం లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆ వైరస్ ఉత్తరాంధ్రలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. శ్రీకాకుళంలో కరోనా కేసులు నాలుగుకు చేరాయని ఆరోగ్యశాఖా మంత్రి ఆళ్ళ నాని తెలిపారు. శ్రీకాకుళంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన మంత్రి శ్రీకాకుళంలో 3576 మందికి నెగిటివ్ రాగా నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.

ఇక విదేశాలనుంచి వచ్చినవారి సంఖ్య 1145 కాగా వీళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నవారు 4271 మందిగా అధికారులు గుర్తించారు. వీళ్ళలో ఢిల్లీనుంచి, ముంబై నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఢిల్లీ నుంచి 230 మంది రాగా ముంబై నుంచి 488 వచ్చినట్లు తెలిపారు. అయితే వీళ్ళ కు జాగ్రత్తలు సూచించడంతో పాటు టెస్టులు చేస్తున్నారు. బయటనుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని గుర్తించి కరోనా లక్షణాలు ఫ్లూ లక్షణాలు ఉన్నట్లయితే జాగ్రత్త పడేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

రేపిడ్ కిట్లు, ట్రూనాట్  పరికరాలతో విస్తృతంగా పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు మంత్రి. ఇక జిల్లాలోని జేమ్స్ ఆస్పత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చినట్టు తెలిపారు. పాతపట్నం ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించడంతో పాటు 32 క్వారెంటెన్ కేంద్రాల్లో పూర్తీ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సరిహద్దుల్లో 50 చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశామని ఇక గుజరాత్ లో ఉన్న మత్యకారులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తునట్టు ఆళ్ళ నాని తెలిపారు..

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular