మంగళవారం, నవంబర్ 28, 2023
Homeరాజకీయంన్యాయమూర్తులపై సుప్రీం కోర్టుకు జగన్ పిర్యాదు....!

న్యాయమూర్తులపై సుప్రీం కోర్టుకు జగన్ పిర్యాదు….!

న్యాయస్తానాలపై యుద్ధం మొదలు పెట్టారా ఏపీ లో నెలకొన్న పరిస్థితులు దేశంలో మరెక్కడాలేవు ఈ పదాలు మేము చెబుతున్నవి కావు సాక్షాత్తు న్యాయస్థానాలు జగన్ ప్రభుత్వ తీరుని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అస్త వ్యస్త పరిపాలన కొనసాగుతుంది. కోర్టులు ప్రభుత్వాన్ని పద్దతి మార్చుకోవాలను సూచిస్తుంటే మీరే పద్దతి మాపద్దతిలోకి మారండి అనే తీరుగా తయారైంది రాజకీయ నాయకుల వ్యవహారం.

దీనికి ఒక ఉదాహరణగా తాజాగా ఒక ప్రముఖ వైసీపీ నేత కోర్టులు ప్రభుత్వాన్ని, నేతలను మందలిస్తుందన్న ఆక్రోశంలో న్యాయస్థానం తీరుపై పలు కామెంట్స్ చేసారు. ఇక పై కోర్టు తమ రాజకీయ నాయకులకు గాని ప్రభుత్వాన్ని గాని ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వాటిని తీర్పు రూపంలోనే పొందుపరచాలని  న్యాయస్థానంపై వ్యాఖ్యలు చేయడం చూస్తే ప్రభుత్వం న్యాయస్థానాలను ఏ రకంగా టార్గెట్  చేస్తుందో అర్ధమౌతుంది.

అంతేకాక నేడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చీఫ్ జస్టిస్ కు ఒక లేఖ రాసారు దానిలో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్, రాష్ట్రంలోని హైకోర్టు న్యాయమూర్తులు కలిసి తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను రక్షించడానికి కృషిచేస్తున్నట్లు ఆ లేఖలో తెలిపారు. అంతేకాక వీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు తెలుపుతూ ఇక్కడి న్యాయమూర్తులు చేసే పనులు న్యాయవ్యవస్థకు తీరని మచ్చలా మారిందన్నారు.

ఇప్పటివరకూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులు, ప్రతిపక్ష పార్టీ టీడీపీ పెట్టిన కేసుల వివరాలు, ప్రభుత్వం తీసుకున్న మూడురాజదానుల విషయం, దానిపై కోర్టులో స్టే, అంతేకాక తెలుగుదేశం వేసే ఫిల్స్ ద్వారా హైకోర్టు జడ్జ్ లను సైతం వీరు ప్రభావితం చేస్తున్నారని ఆ లేఖలో తెలిపారు. అంతేకాక పేదల ఇళ్ళస్థలాలను సైతం స్టే ఇస్తున్నారని జగన్ లేఖలో  పొందుపరుస్తూ సుప్రీం కోర్టుకు కంప్లైంట్ ఇచ్చారు.

అయితే జగన్ రాసిన ఈ లేఖతో నేడు రాష్ట్రంలో మరో దుమారం చెలరేగింది. తెలుగు దేశం పార్టీ నేతలు ఈ విషయాలపై స్పందిస్తూ సంవత్సరంన్నర పాలనలో జగన్ చేసిన అక్రమాలు, దాడులతో రాష్ట్రాన్ని సర్వ నాసనం చేసారంటూ న్యాయమూర్తులను టార్గెట్ చేసుకుని జగన్ ప్రభుత్వం.

చేసిన  సిగ్గుమాలిన పనికి రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారని అన్నారు. 11 సీబీఐ కేసులు 5 ఈడీ కేసులు ఉండి బైలుపై బయట తిరుగుతున్న వ్యక్తి కోర్టు తీర్పులపై కంప్లైంట్ ఇవ్వడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు.     

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular