సోమవారం, డిసెంబర్ 4, 2023
Homeరాజకీయంమార్పు రావాలి... మన పాలన మీ సూచన కార్యక్రమంలో సీఎం జగన్

మార్పు రావాలి… మన పాలన మీ సూచన కార్యక్రమంలో సీఎం జగన్

ఏపీ ప్రభుత్వం నేటి నుండి మన పాలన-మీ సూచన అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. జగన్ ప్రభుత్వం గద్దెనెక్కి  సంవత్సరం కాలం పూర్తయిన తరుణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రణాళికా కార్యదర్శి విజయకుమార్ తెలిపారు.

ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం చేస్తున్న పలు కార్యక్రమాలు ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ప్రజల ఆలోచనలు మరియు వారి కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం రూపొందించామన్నారు.

అయితే ఈ కార్యక్రమాన్ని నేటి మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5గంటల వరకూ సంక్షేమ పధకాల  అమలు వంటి పలు కార్యక్రమాలపై సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ వద్ద నుండి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సంక్షేమ పధకాల లబ్ది దారులతో చర్చించారు.

ఈ కార్యక్రణం ఈ నెల 29 వరకూ కొనసాగుతుంది.  తరువాత రోజు 30వ తారీకున రైతు భరోసా కార్యక్రమం ఉంటుందని అన్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ మూడున్నర కోట్ల మందికి నలభై వేల కోట్ల సాయం చేశామన్నారు.

మరే ఇతర  ప్రభుత్వం ఇప్పటివరకూ  చేయని విదంగా రాష్ట్రంలో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విదంగానే తమ ప్రభుత్వం నెల, డేట్ తో సహా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న తీరు మరే ప్రభుత్వం ఇప్పటిదాకా చేయలేదన్నారు.

మేనిఫెస్టో లో ఇచ్చిన వాగ్దానాలను అమలుకు చాలా విదాలుగా తాపత్రయ పడుతున్నామని అన్నారు. మా పాలనలో కరెప్షన్ కి తావులేకుండా మా పార్టీకి వోటు వేయక పోయినా సరే అర్హులైతే వారికి కూడా ఈ పధకాలు కచ్చితంగా అందాలన్నారు.

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular