దేశ భద్రత విషయంలో హీరో అయినా కామన్ మేన్ అయినా ఒకటేనని నిరూపించాడు CISF జవాన్. టైగెర్ 3 అనే సినిమా షూటింగ్ నిమిత్తం శాల్మాన్ ఖాన్ రష్యా వెళ్ళడానికి మొన్న గురువారం రోజున ముంబాయి ఎయిర్పోర్ట్ కు వచ్చిన సల్మాన్ ఖాన్ ను మీడియా ఫోటో గ్రాఫర్లు పోటోల కోసం భారీగా అక్కడికి చేరుకిని ఫోటోలు తీసుకున్నారు. అది పూర్తైన వెంటనే సల్మాన్ ఖాన్ డైరెక్ట్ గా ప్రధాన ద్వారం గుండా ఎయిర్ పోర్ట్ లోకి ప్రవేశించబోతుండగా అక్కడే ఉన్న CISF జవాన్ చెయ్యి పెట్టి ఆపి లోనికి వెళ్ళాలంటే ముందుగా పాస్పోర్ట్ వెరిఫై చెయ్యాలంటూ అక్కడే ఉన్న కౌంటర్ వైపు పంపించడంతో శాల్మాన్ ఒక్క సారిగా నామోషీగా ఫీలయ్యాడు.
సల్మాన్ కూడా వచ్చిన సెక్రటరీ పాస్పోర్ట్ ఇచ్చి వెరిపై చేయించారు ఇంతలో అక్కడే ఉన్న సల్మాన్ ఫ్యాన్స్ ఈ ఘటనను చూసి గట్టిగా అరవడంతో CISF జవాన్ వారిని వెనక్కి వెళ్ళమని పంపించేసారు. దీనితో ఇప్పుడు అందరూ ఆ జవాన్ డ్యూటీపై ఉన్న నిబద్దత ను చూసి మెచ్చుకుంటున్నారు. ఇదిలాఉండగా సల్మాన్ ఖాన్ ను ఆపిన CISF జవాన్ పై జాతి నెపం నెట్టి కొందరు విమర్శలు చేస్తున్నారు. VIP అని చూడకుండా సల్మాన్ ను ఆపినందుకు CISF జవాన్ ను CISF అదికారులు చర్యలు తీసుకున్నారని సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం మొదలుపెట్టారు.
చివరకు ఈ విషయం పై CISF అదికారులు స్పందిస్తూ CISF అదికారిక ట్విట్టర్ లో CISF జవాన్ చేసిన పనిని మెచ్చుకున్నారు. విది నిర్వహణలో ఆదర్శంగా నిలిచినందుకు జవాన్ కు రివార్డ్ ప్రకటించారు CISF అదికారులు. ఈ మొత్తం వ్యవహారం అక్కడే ఉన్న మీడియా వారు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వైరెల్ అయ్యింది అంతేకాక సల్మాన్ వ్యవహార శైలిపై నెటిజన్లు మండిపడుతూ మనం పెట్టుకున్న రూల్స్ మనం పాటించకపోతే వాటికి విలువెక్కడుంటుందంటూ మండిపడుతున్నారు.