కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ లో భాగంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలెవరూ గుంపులుగా ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలు ఇలా ఏ ఫంక్షన్స్ నిర్వహించడానికి వీల్లేదని ఇప్పటికే ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఏపీలో వాటిని సడలిస్తూ కొద్దిపాటి మార్పులతో పెళ్లిళ్లు చేసుకునేందుకు వెసులుబాటు కలిపిస్తోంది. ఏపీలో 676 మండలాలు ఉండగా వీటిలో 40 మండలాలను రెడ్ జోన్స్ గా గుర్తించారు. మరికొన్నిటిని అంటే 45 మండలాలను ఆరెంజ్ జోన్లు మిగిలినవాటిని గ్రీన్ జోన్స్ గా గుర్తించారు.
రెడ్ జోన్ లో ఉన్న మండలాలేంటో చూద్దాం..
గుంటూరులో 3 మండలాలు రెడ్ జోన్.
చిత్తూరు, ప్రకాశంలో 4 రెడ్ జోన్స్.
నెల్లూరులో 5 రెడ్ జోన్స్ .
ఇక అత్యధికంగా కర్నూలులో 8 మండలాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి.
ఇక ప్రస్తుతం రైతులకు అలాగే వ్యవసాయ కార్యకలాపాలకు ఏ జోన్ లోను ఆంక్షలు లేవు. అయితే ఇకనుంచి ఆరంజ్ జోన్స్ లో పెళ్లిళ్లకు షరతులతో కూడిన అనుమతులు ఇస్తున్నట్టు సమాచారం.