ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రానికి రాసిన లేఖపై ఆయన అదనపు పీఎస్ సాంబమూర్తిని సీఐడీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొద్ది సేపటిక్రితం హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు అక్కడి స్థానిక సీఐడీ కార్యాలయం లో ఆయన్ని ప్రశ్నిస్తున్నారు.
కేంద్రానికి నిమ్మగడ్డ రాసిన లేఖ పై ఎంపీ విజయసాయి రెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పలు మార్లు ఈ లేఖ నేనే రాశానని తెపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఈ లేఖ కేంద్రానిజి అందిందని అప్పట్లో ప్రకటించారు.
ఈ విషయంపై విపక్షం స్పందిస్తూ కేంద్రం చెప్పినా, కేంద్ర మంత్రి చెప్పినా, వినకుండా ఇలా విచారణ పేరుతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అంటున్నారు.
అయితే డీఎస్పీ నేతృత్వంలో ఈ లేఖ ఎవరు రాశారనే సీవిషయం పై విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన డ్రాఫ్ట్ వేరేవాళ్లు రాశారని సంతకం కూడా ఫోర్జరీ చేశారని వైసీపీ నాయకులు అప్పట్లో పలు విమర్శలు చేశారు.
ప్రస్తుతం తనను కుట్ర పూరితంగా తప్ప్పించడం పై నిమ్మగడ్డ రమేష్ వేసిన కేసు ఇప్పుడు కోర్టులో నడుస్తుంది. ఇప్పటిదాకా ఈ కేసు ఆన్లైన్ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా వాదనలు జరిగేవి అయితే రేపటి నుండి ఈ కేసు డైరెక్ట్ గా కోర్టులో వాదనలు జరగనుండటం ఈ రోజు సాంబ మూర్తిని సీఐడీ విచారిస్తుండడం పలు అనుమానాలను కలిగిస్తుంది.