శుక్రవారం, మార్చి 31, 2023
Homeఅంతర్జాతీయంచైనా లో భారీ ఇసుక తుఫాన్ | China Sandstorm

చైనా లో భారీ ఇసుక తుఫాన్ | China Sandstorm

China Sandstorm : ఒకపక్క కరోనా విలయాన్ని సృస్టించిందనే కారణంగా చైనా పై ప్రపంచ దేశాల విమర్శలు గుప్పిస్తుంటే అసలు తమకేమీ తెలియదన్నట్టు వ్యవహరిస్తుంది చైనా. ఆ దేశంలో జరిగిన మారణకాండ పై నోరెత్తిన సైంటిస్టులు, జర్నలిస్టులను అనిచివేసిందనే వార్తలు చాలా సార్లు వెలుగుచూశాయి.

అయితే ఇప్పుడు నేచర్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రెండు రోజుల క్రితం చైనా లో హేనన్ ప్రావిన్స్ లో సంభవిందిన వరదల ధాటికి అతలాకుతలం అయిన చైనా వెయ్యేళ్ళుగా ఎప్పుడూ లేనంత రికార్డు స్థాయిలో వరద బీబత్సం సృష్టించింది.

చైనాలో వరద మిగిల్చిన్ కన్నీళ్ళు ఆరకముందే ఇసుక తుఫాన్ రూపంలో మరొకసారి బీబత్సాన్ని సృష్టిస్తోంది. మూడువందల అడుగుల ఎత్తుకి ఈ ఇసుక తుఫాన్ ప్రభావం ఉందంటే దీని తీవ్రత ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. 

ఇక ఈ ఇసుక తుఫాన్ దున్హువాంగ్ నగరాన్ని మొత్తం కమ్మేయడంతో నగరం మొత్తం ఇసుకతో నిండిపోయింది. సహాయక చర్యల్లో బాగంగా పోలీసులు రహదారులను మూసివేసి ప్రజలు బయటకు రాకుండా ఆంక్షలు విదించారు. ఏదేమైనా చైనాకు ఇప్పుడు గడ్డుకాలం నడుస్తుందనే చెప్పాలి.   

Read Also..భారత నేవీ అమ్ములపోదిలోకి MH-60R మల్టీరోల్ అటాకింగ్ హెలికాఫ్టర్లు   

RELATED ARTICLES

Most Popular